Super Star Rajini: ఇంకా సినిమాలకి రజినీ కాంత్ బ్రేక్ ఇవ్వనున్నారా.. లాస్ట్ మూవీ ఆ డైరెక్టర్ తో నేనా ?
Rajinikanth:
సూపర్ స్టార్ అనగానే గుర్తొచ్చే నటుడు రజినీకాంత్ . ఈయన సౌత్ ఇండియ కే సూపర్ స్టార్ . అయితే ఈయన ప్రస్తుతం ‘జైలర్’ చిత్ర షూటింగ్ ఫినిష్ చేశారు. దీని తర్వాత మరో రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగా.. ఇంకా సినిమాలు ఆపుతున్నట్టు తన చివరి చిత్రం ఇదేనంటూ కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఐదు దశాబ్దాలుగా వెండితెరపై ప్రేక్షకులను సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) గారు ఎంతగానో అలరిస్తున్నారు అయితేఆయన యాక్టింగ్ కెరీర్‌కు ఇంకా గుడ్‌బై చెప్పబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి రజినీ ఇంతకుముందే పాలిటిక్స్‌లో ఎంటరై, సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నారు. కానీ ఆరోగ్యం సహకరించని కారణంగా రాజకీయాల ఆలోచన విరమించుకున్నారు. అయినప్పటికీ 72 ఏళ్ల వయసులోనూ యాక్టింగ్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అయితే రజినీ త్వరలోనే సినిమా (Rajini to Quit Movies) నుంచి తప్పుకుంటారని తమిళ దర్శకుడు మిస్కిన్ (Director Mysskin) రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం హాట్ టాపిక్‌గా మారింది.
దర్శకుడు మిస్కిన్ ఈ వార్తని ప్రకటించినప్పటికీ రజినీకాంత్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీ నటించిన ‘జైలర్’ (Jailer) మూవీ ఈ ఏడాది ఆగస్ట్ 11న విడుదల కానుంది. అయితే, ‘విక్రమ్’ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో (Lokesh Kanagaraj) రజినీ 171వ చిత్రం ఉండనుందని తెలిపిన మిస్కిన్.. ఇదే ఆయన చివరి చిత్రం కావచ్చని వెల్లడించాడు.ఆ సినిమా తో ఇంకా సినీ ప్రపంచానికి గుడ్ బై చెపుతారనే అంటున్నారు .