Rangabali:నాగశౌర్య " రంగబలి" సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ .. ఎక్స్‌పెక్ట్ చేసినట్లే సర్టిఫికెట్!
Rangabali Censor Certificate: పక్కింటి కుర్రాడి తరహా పాత్రలకు టాలీవుడ్‌లో పర్ఫెక్ట్ చాయిస్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు నాగశౌర్య. నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలాంటి ఫీలింగ్ కలిగించగల ఈ కుర్ర హీరో నటించిన తాజా చిత్రం ‘రంగబలి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగశౌర్యకు జంటగా యుక్తి తరేజా నటించింది. ‘దసరా’ మూవీలో విలన్‌గా కనిపించిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ‘రంగబలి’ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ నెలకొనగా జులై 7 థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇదే క్రమంలో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అంతేకాదు ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జులై 1న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్‌లో జరగనుంది.
మాస్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ రూరల్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలవగా.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇక లేటెస్ట్‌గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తవగా.. అనుకున్నట్లుగానే ఈరోజు సాయంత్రం (శుక్రవారం) సెన్సార్ ప్యానెల్ నుంచి ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ లభించింది. కాగా.. రంగబలిలో నాగ శౌర్య తన ఊరిని అమితంగా ప్రేమించే యువకుడిగా నటించాడు. నిత్యం ఫ్రెండ్స్‌తో జల్సాగా తిరిగే తనకు.. డాక్టర్ అయినటువంటి హీరోయిన్‌తో పరిచయం ఏర్పడ్డాక ఎలా మారాడనే సీన్లు హిలేరియస్‌గా ఉండనున్నాయి. అలాగే తను అభిమానించే లోకల్ లీడర్‌తో ఏర్పడిన వైరం.. తనను ఎక్కడిదాకా తీసుకెళ్తుందనేది తెరపై చూడాల్సిందే.