Movie : రష్మికకు క్యూ కడుతున్న వరుస అవకాశాలు... కారణం అదేనా..
Movie రష్మిక మందన టాలీవుడ్ లో పాటు అన్ని భాషల్లో కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే తనకంటూ ఓ పేరును తెచ్చుకున్న ఈ హీరోయిన్ మరిన్ని సినిమా అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతుంది అయితే వీటన్నిటికీ కారణం ఆ ఒక్క సినిమాయే అంటున్నాయి సినీ వర్గాలు..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రంలో రష్మిక మందన అల్లు అర్జున్ సరసన నటించిన పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా హిట్ అవడంతో ఒక్కసారిగా రష్మిక క్రేజ్ మారిపోయింది ఆమెకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.. తెలుగులోనే కాకుండా తమిళం హిందీలో కూడా ఆమె వరుసగా సినిమాలు చేసుకో పోతుంది..
తాజాగా బాలీవుడ్ బిగ్ బి ప్రధాన పాత్రలో నటించిన గుడ్ బాయ్ చిత్రంలో రష్మిక మరో ప్రధాన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే అయితే ఈ చిత్రం స్పందన అందుకుంది సినిమా స్పందన ఎలా ఉన్నా ఈ సినిమాతో రష్మికకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.. ప్రస్తుతం ఈ భామ హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిస్టర్ మజ్ను, రణబీర్ కపూర్ జోడిగా యానిమల్ చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ ప్రస్తుతం చాలా వేగంగా జరుగుతున్నాయి అయితే వీటితోపాటు పుష్ప 2 షూటింగ్ లో కూడా రష్మిక తొందర్లోనే పాల్గొనడం ఉందని సమాచారం.
