Health మీకు జుట్టు రాలుతుందా..? అయితే కుదుళ్లను దృఢంగా మార్చే వెల్లుల్లి చికిత్సను ట్రై చేయండి..!
Health బయట పెరిగిపోతున్న కాలుష్యం, మారిపోయిన ఆహారపు అలవాట్లతో పాటు వివిధ కారణాలతో యువత, మహిళల్లో విపరీతంగా జుట్టు రాలిపోతుంది. ఇందుకు… జన్నుపరమైన కారణాలూ ఉంటాయంటున్నారు నిపుణులు.
జుట్టు రాలడం వల్ల తెగ బాధపడిపోతున్న యవత…. ఈ సమస్య నుంచి బయటుపడేందుకు మార్కెట్‌లో దొరికే రసాయన ఉత్పత్తులు వాడుతూ మరిన్ని దుష్ప్రభావాల బారిన పడుతున్నారు. ఇందుకు జుట్టు కుదుళ్లకు ప్రోటీన్‌లు అంతకే జుట్టు రాలుతుంటుంది. ఈ సమస్య నుంచి బయటుడేందుకు… తినే తిండి, తాగే నీరు, జీవన శైలిపై కాస్త శ్రద్ధ వహిస్తే జుట్టు రాలే సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు…. నిపుణులు. జట్టు కుదుళ్లను బలం చేకూర్చేందుకు వెల్లుల్లి బాగా తోడ్పడుతుందంటున్నారు. మన వంట గదిలోని వెల్లుల్లిలో అధిక పరిమాణంలో పోషకాలు ఉండడంతో… పాటు… సల్ఫర్, ఐరన్ వంటి పోషకాలు. సమృద్ధిగా ఉంటాయి. అందుకే… వెల్లుల్లి జుట్టుకు కావలసిన పోషణను అందించి జుట్టు దృఢంగా, పొడవుగా పెరిగేలా సహాయపడతాయి.
వెల్లుల్లితో జుట్టుకు ప్యాక్ : ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయను ముక్కలుగా కత్తిరించాలి. వీటిని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని పల్చటి గుడ్డ సహాయంతో రసాన్ని తీయాలి. ఆ రసాన్ని జుట్టు కుదుళ్ళకి బాగా పట్టించి… 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయాలి. ఇలా… వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసి, జ్యూస్ తీసి, ఒక టేబుల్ స్పూన్ గార్లిక్ జ్యూస్‌ను అరకప్పు కొబ్బరి నూనెతో కలపాలి. దీన్ని గోరువెచ్చగా వేడి చేసి, ఈ నూనెను తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత రెగ్యులర్ షాంపు, కండీషనర్‌తో తలస్నానం చేయాలి.
