For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Hanuman 100 Days Celebrations : 'హనుమాన్' వంద రోజులు ఆడటం అదృష్టంగా భావిస్తున్నాను : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

10:50 PM Apr 23, 2024 IST | Sowmya
Updated At - 10:50 PM Apr 23, 2024 IST
hanuman 100 days celebrations    హనుమాన్  వంద రోజులు ఆడటం అదృష్టంగా భావిస్తున్నాను   డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
Advertisement

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది. ఇది హిందీతో సహా అన్ని భాషలలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. హనుమాన్ విజయవంతంగా వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా సెలబ్రేషన్ నిర్వహించింది.

హనుమాన్ హిస్టారిక్ 100 డేస్ సెలబ్రేషన్స్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమన్ యాభై రోజుల వేడుక జరిగిన సమయంలో నిర్మాత నిరంజన్ గారు మనం వంద రోజుల వేడుక కూడా చేయగలుగుతామని అన్నారు. కానీ నేను నమ్మలేదు. కాకపొతే మీరంతా దాన్ని నిజం చేశారు. ఇంద్ర, సమరసింహా రెడ్డి, నువ్వునాకు నచ్చావ్, ఖుషి, పోకిరి నాకు బాగా గుర్తున్న వంద రోజుల వేడుకలు జరుపుకున్న సినిమాలు. నేను డైరెక్టర్ అయిన తర్వాత సినిమా అంటే ఒక వీకెండ్ అయిపోయింది. అలాంటి ఈ జనరేషన్ లో వందవ రోజు కూడా థియేటర్స్ కి వచ్చి సినిమా చుస్తున్నారంటే చాలా అదృష్టంగా ఫీలౌతున్నాను. హనుమాన్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా అని మొదటి నుంచి చెప్పాం. దాన్ని నిలబెట్టుకున్నందుకు ఆనందంగా వుంది.

Advertisement GKSC

ఈ వంద రోజుల్లో ప్రతి రోజు సినిమా తొలి రోజుకు వచ్చిన స్పందనే లభిస్తోంది. ఇంత అదృష్టాన్ని కల్పించిన హనుమంతుల వారికి, రాములవారికి రుణపడి వుంటాను. తేజ, నిరంజన్ గారు, వరు, సముద్రఖని గారు టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పీవీసియు కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇది చాలా కాలంగా కన్న కల. రానున్న ఇరవై ఏళ్ళు దీనిపై స్పెండ్ చేయబోతున్నాను. ఈ యూనివర్స్ లో మీరు చేసే పాత్రలు మళ్ళీ రాబోతున్నాయి.

సముద్రఖని గారు విభీషుడిగా కనిపించబోతున్నారు. తేజ హను- మాన్ గా కొనసాగుతారు. కొన్ని సర్ ప్రైజ్ పాత్రలు కూడా రాబోతున్నాయి. పీవీసియు లో అన్ని పరిశ్రమల నుంచి చాలా పెద్ద స్టార్స్ కనిపించబోతున్నారు. పీవీసియు నుంచి వచ్చే సినిమాలు మీ అందరి అంచనాలు అందుకొని మిమ్మల్ని ఆనందపరుస్తాయి. తెలుగు ఆడియన్స్ గర్వపడేలా చేస్తామని నమ్మకంగా చెబుతున్నాను.  జైహనుమాన్ ని బిగ్గెస్ట్ ఫిల్మ్ గా రూపొందిస్తున్నాం. గొప్ప ఎమోషన్స్ కనెక్ట్ వీఎఫ్ఎక్స్ అన్నీ వుంటాయి. మీరు ఇలానే సపోర్ట్ చేసి ఆ సినిమాని వంద రోజులు ఆడేలా చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జైశ్రీరామ్.. జై హనుమాన్' అన్నారు.

Advertisement
Author Image