For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telangana News: ఐటీ రంగంలో నెంబర్ వన్ హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

03:45 PM Dec 11, 2021 IST | Sowmya
Updated At - 03:45 PM Dec 11, 2021 IST
telangana news  ఐటీ రంగంలో నెంబర్ వన్ హైదరాబాద్  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Advertisement

హైదరాబాద్ నగరం నలువైపులా ఐటి పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఉప్పల్ అబాకస్ ఐటి పార్క్‌లో సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటి కంపెనీ నూతన ‌కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఐటీ రంగాన్ని హైదరాబాద్ లో అన్ని వైపులా విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. అందులో భాగంగా ఉప్పల్ కారిడార్ లో అనేక ఐటీ పరిశ్రమలు నెలకొల్పుతుండటంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు.

ఐటీ పరిశ్రమలు నెలకొల్పే దిశగా మంత్రి కేటీఆర్ గారు యువతను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్న ఎమ్మెల్సీ కవిత, హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. కంపెనీ స్థాపించి అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటి కంపెనీ యాజమాన్యాన్ని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఈ రోజు ప్రారంభించిన కొత్త కంపెనీలో దాదాపు 300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement GKSC

Hyderabad No1 City in IT in India. K Kavitha MLC,Telangana News,Abacus IT Park Saligram & Tech Smart IT Company,Uppal MLA Bhethi Subash Reddy,telugu golden tv,teluguworldnow.com

Advertisement
Author Image