For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telangana News: నిజమైన హైదరాబాదీ ఫుడ్ బ్రాండ్ తన డెక్కన్ వంటకాలకు ప్రాచుర్యం పొందిన రెస్టారెంట్ (హైదరాబాద్ హవుస్) నేడు పునః ప్రారంభం

05:17 PM Nov 21, 2021 IST | Sowmya
Updated At - 05:17 PM Nov 21, 2021 IST
telangana news  నిజమైన హైదరాబాదీ ఫుడ్ బ్రాండ్ తన డెక్కన్ వంటకాలకు ప్రాచుర్యం పొందిన రెస్టారెంట్  హైదరాబాద్ హవుస్  నేడు పునః ప్రారంభం
Advertisement

1975 లో స్థాపించబడి డెక్కన్ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ హవుస్ రెస్టారెంటు పునః ప్రారంభమైంది. హైదరాబాదు నుండి తన ప్రయాణం ప్రారంభించి పలు దేశాలలో హైదరాబాదీ ఫుడ్ కు ప్రాచుర్యం కలిపిస్తూ తదుపరి పలు కారణాలతో మూతపడిన ఈ రెస్టారెంట్ బ్రాండ్ తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది. నేటి ఉదయం బేగం పేట, సికింద్రాబాద్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్, తెలంగాణా రాష్ట్ర పశు సంవర్థక, ఫిషరీస్, పాడి పరిశ్రమ అభివృద్ది మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు పాల్గొని లాంఛనంగా రెస్టారెంట్ ను ప్రారంభించారు. ప్రారంభోత్సం తర్వాత శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు రెస్టారెంట్ లో కలియ తిరిగి రెస్టారెంట్ లో అందించే ఆహారపు వివరాలు అడిగి తెలుసుకొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ హైదరాబాదు ఫుడ్ ను ప్రపంచానికి పరిచయం చేసిన రెస్టారెంట్ తిరిగి ప్రారంభం కావడం సంతోషాన్నిస్తున్నదని అంటూ యాజమాన్యాన్ని అభినందించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రెస్టారెంట్ ల రంగం మరళా తిరిగి పునః వైభవాన్ని సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Advertisement GKSC

అనంతరం హైదరాబాదు హవుస్ రెస్టారెంట్ యొక్క గతాన్ని వివరించిన రెస్టారెంట్ బ్రాండ్ వ్యవస్థాపకుల కుటుంభానికి ప్రతినిథి శ్రీ జుబైర్ మాట్లాడుతూ హైదరాబాద్ హవుస్ అనబడే రెస్టారెంట్ కథ ఎన్నో దశాబ్దాల క్రితం ప్రారంభమైందన్నారు. 1975 లో తన తండ్రి మిర్ మజారుద్దీన్ మరియు అతని సోదరుడు మిర్ అన్వరుద్దీన్ లు, హైదరాబాదు నగరంలో క్యాటరింగ్ బిజినెస్ లో ఎంతో పేరు ప్రతిష్టలు గడించిన తర్వాత తమ వంటకాలను ప్రజలకు మరింత దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఈ రెస్టారెంట్ కు స్వీకారం చుట్టడం జరిగిందని వివరించారు. అయితే ధమ్ బిర్యానీ లాంటి వాటిని తక్కువ మోతాదులో తయారు చేసి సరఫరా చేయడం ఎంతో కష్టసాధ్యం లేదా కుదరని పని అయితే తన వద్దకు వస్తున్న వారిని నిరాశ పరచడం కూడా ఇష్టం లేని మజర్ మదిలో మెదిలిన సరికొత్త ఆలోచనే హైదరాబాద్ హవుస్ ఫుడ్ జాయింట్ లకు నాంది పలికిందని ఆయన వివరించారు. అంటే ఈ ఫుడ్ జాయింట్ ల ద్వారా తక్కువ మొత్తాలలో కూడా హైదరాబాదీయులకు తమ బిర్యానీ తో పాటూ ఇతర వంటకాలను రుచి చూపించడానికి వీలు కలిపించే మార్గం దొరికిందని, అలా ప్రారంభమైన మొదటి అవుట్ లెట్ ఎంతో ప్రాచుర్యం పొందిన తర్వాత నెమ్మదిగా హైదరాబాదులోని పలు ప్రాంతాలలో మరిన్న హైదరాబాద్ హవుస్ పుఢ్ జాయింట్ లను ప్రారంభించడమే కాకుండా నెమ్మదిగా దేశ వ్యాప్తంగానే కాకుండా ఆస్ట్రేలియా, నేపాల్, సౌదీ అరేబియా, దుబాయి వంటి దేశాలకు కూడా విస్తరించిందని తెలిపారు.

Hyderabad House Restaurant Reopens Today By Minister Talasani Srinivas, Mr. Zubair Ahmed,Meer Kamaruddin,Koushik,Health News,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.1అయితే పలు దురదృష్టకరమైన సంఘటనలు, కారణాల చే హైదరాబాద్ హవుస్ మూత పడింది. ఇలా మూత పడిన హైదరాబాదు హవుస్ ఫుడ్ జాయింట్ ను అదే పేరుతో క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ఫార్మట్ లో మజారుద్దీన్ మరియు అతని కుమారుడు జుబేర్ లు కలసి మరో మారు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇపుడిపుడే కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఉత్పాతం నుండి ప్రజలు తేరుకుంటున్న వేళ తమ మొదటి అవుట్ లెట్ ను ప్రారంభిస్తున్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్, తెలంగాణా రాష్ట్ర పశు సంవర్థక, ఫిషరీస్, పాడి పరిశ్రమ అభివృద్ది మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు తో పాటూ రెస్టారెంట్ వ్యవస్థాపకులు శ్రీ జుబేర్ మరియు వ్యవస్థాపక కుటుంభ సభ్యులు, శ్రీ కౌశిక్, జనరల్ మేనేజర్, హైదరాబాదు హవుస్ లతో పాటూ పలువురు ఇతరులు పాల్గొన్నారు.

Hyderabad House Restaurant Reopens Today By Minister Talasani Srinivas, Mr. Zubair Ahmed,Meer Kamaruddin,Koushik,Health News,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com.1

Advertisement
Author Image