For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Crime ఇద్దరు భార్యల పోరు… ఇంజక్షన్‌తో‌ రెండో భార్యను హత్య చేసిన భర్త

12:24 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:24 PM May 13, 2024 IST
crime ఇద్దరు భార్యల పోరు… ఇంజక్షన్‌తో‌ రెండో భార్యను హత్య చేసిన భర్త
Advertisement

Crime ఖమ్మం జిల్లాలో సూది మందులో హత్య చేసిన మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సవతుల మధ్య పోరుతో విసిగిపోయి… ఏకంగా రెండో భార్యకు మత్తు మంది ఇచ్చి హత్య చేశాడో వ్యక్తి… ఇటీవలే ఖమ్మం జిల్లాలో సూది మందుతో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారగా… ఇప్పుడు అలాంటిదే మరో ఘటన బయటకు వచ్చింది.

ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం అనే వ్యక్తి స్థానికంగా ఓ ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా, అనస్థీసియా వైద్యుడి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నాడు. మొదట తన మేనకోడలిని వివాహం చేసుకున్న భిక్షం… చాన్నాళ్లుగా పిల్లలు కలగగ పోవడంతో… మొదటి భార్య అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకున్నాడు. తన కంటే దాదాపు 20 ఏళ్లు చిన్నదైన నవీన అనే యువతిని వివాహం చేసుకున్నాడు. చాలా రోజులు ముగ్గురు అన్యోన్యంగానే కలిసి ఉన్నారు. ఈ సమయంలోనే నవీన పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత.. సవతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే నవీన రెండో సారి గర్భం దాల్చింది. ఇద్దరు భార్యల మధ్య గొడవలతో విసిగిపోయిన భిక్షం.. రెండో భార్య నవీనను హతమార్చేందుకు నిర్ణయించుకున్నాడు.

Advertisement GKSC

రెండో కాన్పు కోసం జూలై 30న ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా… ఆడశిశువు జన్మనిచ్చింది. ఆ మరుసటి రోజు తెల్లవారే నవీన ఆసుపత్రిలో చనిపోయింది… ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందంటూ… భిక్షం ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశాడు. ఆ పరిస్థితుల్లో నవీన హఠాత్తుగా ఎందుకు చనిపోయిందో అర్థం కాని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది … ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో ఆందోళన విరమించిన భిక్షం…. నవీన మృతదేహానికి ఖమ్మం శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు నిర్వహించాడు. దాంతో… ఆస్పత్రి సిబ్బందిలో అనుమానం మొదలైంది. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా… అసలు విషయం బయటపడింది. ప్రసవం జరిగిన రోజు అర్ధరాత్రి 2గంటల సమయంలో నిందితుడు…. తన భార్యకు ఇంజక్షన్‌ ఇవ్వడం, ఆమె చనిపోయిందని నిర్ధరించుకున్న తర్వాత బయటకు వెళ్లి హడావుడి చేయడం కనిపించాయి. విషయం తెలుసుకున్న ఆసుపత్రి యాజమాన్యం… ఖమ్మం టూ టౌన్‌ పోలీసులను సంప్రదించింది. దాంతో… భిక్షంను అదుపులోకి తీసుకుని విచారించగా…. నవీనకు ఇంజక్షన్‌ ద్వారా అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి చంపినట్టు ఒప్పుకున్నాడు. రెండు వారాల క్రితమే పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా… ఇటీవల సంచలమైన జమాల్ ‌సాహెబ్‌ ఘటనతో ఆ కేసు వెలుగులోకి వచ్చింది.

Advertisement
Author Image