HEALTH NEWS: వీరి ద్వారానే కరోనా వ్యాప్తి ఎక్కువగా అవ్వడానికి అవకాశం ఉందంట...?
ఇప్పుడు ప్రపంచంలో అందరిని ఒక్కసారిగా, ఒకేలా వేధిస్తున్న సమస్య కరోనా. ఇప్పుడు ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే వ్యాక్సిన్ రావాలి అని ఎదురు చూసారు, వ్యాక్సిన్ వచ్చింది. కానీ ఇప్పటి వరకు సోషల్ డిస్టెన్స్ ని పాటిస్తూ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, కరోనా వ్యాప్తి చెందటంలో ఎక్కడా ఆగడం లేదు. అసలు ఇది ఎవరి ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనే విషయం పై క్లారిటీ రావడం లేదని, దాని గురించి ఎలాగైనా తెలుసుకోవాలని ఎందరో పరిశోధకులు, పరిశోధన చేయడం మొదలు పెట్టారు.
ఆక్స్‌ఫర్డ్ జరిపిన పరిశోధనల్లో చిన్న పిల్లలు వలన కరోనా తొందరగా వ్యాప్తి చెందుతుందని కనిపెట్టారు. పరిశోధనలో చిన్నారుల వలన ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని తెలియడం వలన, వారిపై క్లినికల్ ట్రయల్స్ చేయాలని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రయోగం మొదట్లో కొందరికి అనారోగ్య సమస్యలు తేవడం వలన దానిని అప్పుడు నిలివేసిన సంగతి మనందరికీ తెలిసినదే. కానీ ఇప్పుడు మరల ప్రయోగం మొదలు పెట్టారు. పిల్లల వలన ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందుతుందని తెలిసిన తరవాత చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ మాత్రం రెండో దశలోనే నిలిపివేసి, వారి పై ప్రయోగం చేయాలని అనుకుంటున్నారు.
అయితే చిన్న పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే కరోనా వలన ప్రపపంచం మానసికంగా, ఆర్ధికంగా ఎంతగానో చిదికిపోయింది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయి, వ్యాపారస్తులకు వ్యాపారం లేక అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. బంగారు భవిస్యతులోకి అడుగు పెట్టాల్సిన విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్ తో సతమతమవుతున్నారు. చిన్న పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువలన వీరికి పెద్దవాళ్ళకి ఒకేలా వ్యాక్సిన్ డోసు ఇచ్చినా కూడా సెట్ అవ్వదని అభిప్రాయపడుతున్నారు. అందుకే వ్యాక్సిన్ డొసేజ్ లో తేడా ఉంటుందని అంటున్నారు...