For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Lok Sabha Elections 2024 : తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ అర‌వింద్ మీన‌న్ ని కలిసిన హిందూ ధర్మ ప్రచార కర్త చెరుకు కరణ్ రెడ్డి

11:57 AM Feb 09, 2024 IST | Sowmya
Updated At - 11:57 AM Feb 09, 2024 IST
lok sabha elections 2024   తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ అర‌వింద్ మీన‌న్ ని కలిసిన హిందూ ధర్మ ప్రచార కర్త చెరుకు కరణ్ రెడ్డి
Advertisement

ధ‌ర్మో ర‌క్షతి ర‌క్షితః అంటారు... అంతే కాదు క‌ర్మో ర‌క్షతి ర‌క్షితః అని కూడా చెప్ప వ‌చ్చు. అందుకు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ మ‌న చెరుకు క‌ర‌ణ్ రెడ్డి అన్న‌. ఆయ‌న చూడ్డానికి చెరుకులా చాలా క‌ఠువుగానే ఉంటారు. కానీ తాను చేసే కార్య‌క్ర‌మాలు మాత్రం చెరుకు ర‌సంలోని తీపిలా ఎంతో గొప్ప‌గా ఉంటాయి. హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ అన్న‌ది త‌న జీవ‌న విధానంలో ఒక భాగ‌మైన క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌స్తుతం జ‌హీరాబాద్ ఎంపీ బ‌రిలో నిలిచారు. ఈ దిశ‌గా ఆయ‌న తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ అర‌వింద్ మీన‌న్ ను క‌లిసి.. త‌న అభిమ‌తం తెలియ చేశారు.. రాష్ట్ర బీజేపిని బ‌లోపేతం చేయ‌డానికి కృషి చేస్తాన‌ని తెలియ చేశారు. అవ‌కాశం ఇస్తే తాను సైతం ఒక ఎంపీగా గెలిచి.. కేంద్రంలో బీజేపీ మూడో సారి అధికారంలోకి రావ‌డానికి త‌న వంతు య‌త్నం చేశారు.

ఇప్ప‌టికే క‌ర‌ణ్ రెడ్డి ప్రొఫైల్ కేంద్ర అగ్ర‌నేత అమిత్ షా వ‌ర‌కూ వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. క‌ర‌ణ్ రెడ్డి హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని.. జ‌హీరాబాద్ ఎంపీ అభ్య‌ర్ధుల్లో ముందు వ‌రుస‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ఏంటి.. క‌ర‌ణ్ రెడ్డికి బీజేపీ ఎంపీగా నిలిచేంత‌టి అర్హ‌త? ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న చేసిన ప‌నులేంట‌ని చూస్తే.. క‌ర‌ణ్ రెడ్డిలో మ‌నం మొత్తం మూడు పార్శ్వాల‌ను చూడ‌వ‌చ్చు.. మొద‌టిది జ‌ర్న‌లిస్టు- వ్యూహ‌క‌ర్త‌- ఆపై ఆధ్యాత్మిక వేత్త‌గా ఆయ‌న ప్ర‌యాణాన్ని.. మూడు విధాలుగా విభ‌జించ‌వ‌చ్చు. జ‌ర్న‌లిస్టుగా విశేష సేవ‌లందించిన క‌ర‌ణ్ రెడ్డి.. కేవ‌లం వార్త‌లు రాయ‌డం, అందివ్వ‌డం మాత్ర‌మే కాకుండా.. వివిధ పార్టీల నాయ‌కుల‌కు వ్యూహ‌క‌ర్త‌గానూ ప‌ని చేశారు. వారి వారి విజ‌యాల‌లో అత్యంత కీల‌క పాత్ర పోషించారు.

Advertisement GKSC

తెలంగాణ‌లో బీఆర్ఎస్, ఏపీలో వైయ‌స్ఆర్సీపీ కి స్ట్రాట‌జిస్టుగా త‌న సేవ‌లందించి.. ఆ దిశ‌గా ఆయా పార్టీలు అధికారంలో వ‌చ్చే విధంగా కృషి చేశారు. క‌ర‌ణ్ రెడ్డి అన్న ర‌చించిన వ్యూహాల కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాల‌ అసెంబ్లీలో అడుగు పెట్టిన లీడ‌ర్లు ఎంద‌రో. ఇదిలా ఉంటే.. ఆయ‌న‌లోని మ‌రో విశిష్ట‌గుణం.. ఆధ్యాత్మిక వేత్త‌. హిందూ ధ‌ర్మ ప్ర‌చార యాత్ర కోఆర్డినేట‌ర్ గా ఆయ‌న శార‌దాపీఠం స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి మ‌హాస్వామి, స్వాత్మానంద స‌ర‌స్వ‌తీ స్వామి వార్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ధ‌ర్మ సంస్థాప‌న‌కు పాద‌యాత్ర చేశారు.

ఈ పాదయాత్రలో భాగంగా 7500 కిలోమీటర్లు నడిచి, సుమారు 1000 కి పైగా ఆలయాలను సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పనితీరుకు ఆకర్శితులైన కరణ్‌రెడ్డి.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. హిందూ బంధువుగా, ధర్మ ప‌రిరక్షకుడిగా, ప్రజా సేవకుడిగా.. ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తూ ముందుకు సాగుతున్న చెరుకు కరణ్‌రెడ్డిని మనమంతా ఆశీర్వదిద్దాం.. ఆయన ఆశయసాధనలో పాలుపంపచుకుందాం.

క‌రం క‌రం క‌లుపుదాం..
క‌దం క‌దం తొక్కుదాం..
క‌ర‌ణ్ రెడ్డి అన్న‌ క‌మ‌లంలా
విక‌సించాల‌ని కోరుకుందాం..

Advertisement
Author Image