For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telangana News: హైకోర్టు ప్రాంగణంలో మొక్క నాటిన హైకోర్టు సీజే "జస్టిస్‌ సతీశ్‌చంద్ర"

05:30 PM Nov 17, 2021 IST | Sowmya
Updated At - 05:30 PM Nov 17, 2021 IST
telangana news  హైకోర్టు ప్రాంగణంలో మొక్క నాటిన హైకోర్టు సీజే  జస్టిస్‌ సతీశ్‌చంద్ర
Advertisement

పర్యావరణ పరిరక్షణకు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌ను అభినందించారు. అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో మంగళవారం హైకోర్టు ప్రాంగణంలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మ, ఇతర న్యాయమూర్తులు ఏజీ బీఎస్‌ ప్రసాద్‌, అడిషనల్‌ ఏజీ జే రామచందర్‌రావుతో కలిసి ఎంపీ సంతోష్‌కుమార్‌ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తాను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్టు గుర్తుచేశారు. ఎంపీ సంతోష్‌ మాట్లాడుతూ.. హైకోర్టు ప్రాంగణంలోని ప్రభుత్వ పాత జజ్గీఖానా (ప్రసూతి దవాఖాన)లో తాను జన్మించానని, ఆ ప్రాంగణంలో మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీజేతోపాటు న్యాయమూర్తులకు వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ జీ శ్రీదేవి, జస్టిస్‌ సుధ, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఏ నరసింహారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పొన్నం అశోక్‌గౌడ్‌, బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కల్యాణ్‌రావు, జీపీలు జోగినిపల్లి సాయికృష్ణ, సంతోష్‌కుమార్‌, పీపీలు, సీనియర్‌ న్యాయవాదులు, స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు, ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు గోవర్ధన్‌రెడ్డి, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కోఫౌండర్‌ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement GKSC

High Court CJ Justice Satish Chandra Planted Plant at the High Court Premises,Green India Challenge,CM KCR,Joginapally Santhosh Kumar,v9 news telugu,telugu golden tv,www.teluguworldnow.com

Advertisement
Author Image