Tollywood News : అంగరంగ వైభవంగా జరిగిన వెంకటేష్ కుమార్తె హవ్య వాహిని, డాక్టర్ నిషాంత్ ల వివాహం
11:03 PM Mar 16, 2024 IST | Sowmya
Updated At - 11:03 PM Mar 16, 2024 IST
Advertisement
విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి కుమార్తె హవ్య వాహిని, డాక్టర్ నిషాంత్ మార్చి 15, 2024 శుక్రవారం నాడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శ్రీమతి రాజేశ్వరి & దివంగత శ్రీ దగ్గుబాటి రామానాయుడు, శ్రీమతి ఉషాదేవి & దివంగత శ్రీ గంగవరపు వెంకట సుబ్బారెడ్డి ఆశీస్సులతో హవ్య వాహిని, డాక్టర్ నిషాంత్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో కుటుంబసభ్యులు, వధూవరుల స్నేహితులు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఆనందోత్సాహాలతో కూడిన సంగీత్, పెళ్లి కూతురు ఫంక్షన్స్ తో సెలబ్రెషన్స్ ప్రారంభమయ్యాయి.
వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హవ్య వాహిని వెంకటేష్ దగ్గుబాటి నీరజల కుమార్తె. నిషాంత్, డాక్టర్ పాతూరి వెంకట రామారావు అరుణల కుమారుడు.
Advertisement