FILM NEWS: తళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా భారీ చిత్రం
Hero Thalapathy Vijay's 66th Film With Director Vamshi Paidipally and Producer Dil Raju, Latest Telugu Movies, Telugu World Now,
FILM NEWS: తళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా భారీ చిత్రం
అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు తళపతి విజయ్. తను చేసే ప్రతి సినిమాతో అతని పాపులారిటీ మరింతగా పెరుగుతోంది. విజయ్ తన 66వ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత దిల్ రాజు, శిరీష్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు.
ఈ రోజు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. తళపతి విజయ్, వంశీ పైడిపల్లి మరియు దిల్ రాజు కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ పై అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతమైన బజ్ నెలకొని ఉంది. సినిమా రంగం పట్ల అభిరుచి, నైపుణ్యం కలిగిన వ్యక్తుల కలయికతో ఈ సినిమా ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది.
ప్రస్తుతం విజయ్ నెల్సన్ దర్శకత్వంలో చేస్తోన్న తన 65వ చిత్రం `బీస్ట్` పూర్తికాగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ప్రముఖ నటీనటులు మరియు అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు. ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వెల్లడించనున్నారు.