For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"హీరో సిద్దార్ద్" పుట్టిన‌రోజు సంద‌ర్భంగా "మ‌హాస‌ముద్రం" లోని సిద్దార్ద్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

02:56 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:56 PM May 11, 2024 IST
 హీరో సిద్దార్ద్  పుట్టిన‌రోజు సంద‌ర్భంగా  మ‌హాస‌ముద్రం  లోని సిద్దార్ద్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల
Advertisement

Hero Siddharth’s First Look In Maha Samudram Unveiled On His Birthday, Heroine Aditi Rao Hydari, Anu Emmanuel, Ajay Bhupathi,

హీరో సిద్దార్ద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా `మ‌హాస‌ముద్రం`లోని సిద్దార్ద్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

Advertisement GKSC

టాలీవుడ్ లో త‌న కంబ్యాక్ మూవీకి సరైన స్క్రిప్ట్ కోసం చాలా కాలం ఎదురుచూసిన హీరో సిద్ధార్థ్  దర్శకుడు అజయ్ భూపతి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `మ‌హాస‌ముద్రం` మూవీలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.. ఈ మూవీలో  యంగ్ హీరోస్ శ‌ర్వానంద్‌, సిద్దార్డ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ మహాసముద్రంలోని అతని ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఇటీవ‌ల విడుద‌లైన తన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శ‌ర్వానంద్ కొంచెం అగ్రెసివ్ లుక్‌లో  కనిపించగా, సిద్ధార్థ్  మాత్రం ప్రశాంతంగా క‌నిపిస్తున్నారు. బ్లూ క‌ల‌ర్ ష‌ర్ట్‌లో ఉన్న  ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆకర్షణీయంగా ఉంది. ఒక పొడవైన క్యూలో నిలబడి ఎవ‌రినో చూస్తున్న‌ట్లు స్పష్టంగా తెలుస్తుంది.

ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు.

అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూల్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు.

చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌, కొల్ల అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం వైజాగ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్‌19న  విడుద‌ల‌చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌.

తారాగ‌ణంః
శ‌ర్వానంద్‌, సిద్ధార్ద్‌, అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూల్

సాంకేతిక వ‌ర్గం:
‌ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి
నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
కో- ప్రొడ్యూస‌ర్‌: అజ‌య్ సుంక‌ర‌
బ్యాన‌ర్‌: ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: కిషోర్ గ‌రికిపాటి
సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్
సినిమాటోగ్ర‌ఫి: రాజ్‌తోట
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అవినాష్ కొల్లా
ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ కేఎల్‌
యాక్ష‌న్‌: వెంక‌ట్
పిఆర్ఓ: వంశీ- శేఖ‌ర్

Maha Samudram is slated for release on August 19th.

Cast:

Sharwanand, Siddharth, Aditi Rao Hydari, Anu Emmanuel
Technical Crew:
Writer, Director: Ajay Bhupathi
Producer: Sunkara Ramabrahmam
Co-Producer: Ajay Sunkara
Banner: AK Entertainments
Ex-Producer: Kishore Garikipati
Music Director: Chaitan Bharadwaj
Cinematography: Raj Thota
Production Designer: Kolla Avinash
Editor: Praveen KL
Action: Venkat
PRO: Vamsi Shekar

Advertisement
Author Image