For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: నితిన్, నభానటేష్, మేర్లపాకగాంధీ, శ్రేష్ఠ్ మూవీస్‌ "మ్యాస్ట్రో" షూటింగ్‌ పూర్తి.

03:03 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:03 PM May 11, 2024 IST
film news  నితిన్  నభానటేష్  మేర్లపాకగాంధీ  శ్రేష్ఠ్ మూవీస్‌  మ్యాస్ట్రో  షూటింగ్‌ పూర్తి
Advertisement

Hero Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Shooting Completed, Nabha Natesh, Tamannaah, Film News, Telugu World Now,

FILM NEWS: నితిన్, నభానటేష్, మేర్లపాకగాంధీ, శ్రేష్ఠ్ మూవీస్‌ "మ్యాస్ట్రో" షూటింగ్‌ పూర్తి.

Advertisement GKSC

హీరో నితిన్‌ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘మ్యాస్ట్రో’. నితిన్‌ 30వ మూవీగా  తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్‌ కామెడీ చిత్రంలో  నితిన్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది.  ‘మ్యాస్ట్రో’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

‘మ్యాస్ట్రో’ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన సంగతి తెలిసిందే. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు మేర్లపాక గాంధీ. సినిమాలో వచ్చే అత్యంత కీలకమైన సన్నివేశాలు ఇవి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్
వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత షూటింగ్‌లో పాల్గొన్న ఫస్ట్ స్టార్ హీరో మూవీ ‘మ్యాస్ట్రో’ కావడం విశేషం.

ఇప్పటికే నితిన్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసిన ‘మ్యాస్ట్రో’ ఫస్ట్‌లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది.

మహతి స్వరసాగర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు నితిన్‌ హిట్‌ మూవీ ‘భీష్మ’కు మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి స్వరసాగరే..

శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ‘మ్యాస్ట్రో’ సినిమాకు జె యువరాజ్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు:
నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్‌ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి

సాంకేతిక విభాగం:
డైరెక్షన్, డైలాగ్స్‌: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి
బ్యానర్‌: శ్రేష్ఠ్ మూవీస్‌
సమర్పణ: రాజ్‌కుమార్‌ ఆకేళ్ళ
మ్యూజిక్‌ డైరెక్టర్‌: మహతి స్వరసాగర్‌
డీఓపీ: జె యువరాజ్‌
ఎడిటర్‌: ఎస్‌ఆర్‌ శేఖర్‌
ఆర్ట్‌ డైరెక్టర్‌: సాహి సురేష్‌
పీఆర్వో: వంశీ–శేఖర్‌

Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Shooting Completed,Nabha Natesh, Tamannaah,telugu golden tv et,my mix entertainments,teluguworldnow.com,

Advertisement
Author Image