For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Egg For Hair Growth: గుడ్డు ని జుట్టుకి ఇలా వాడడం వల్ల ఎన్ని లాభాలో .. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి ...

12:11 PM Jul 01, 2023 IST | Sowmya
Updated At - 12:11 PM Jul 01, 2023 IST
egg for hair growth  గుడ్డు ని జుట్టుకి ఇలా వాడడం వల్ల ఎన్ని లాభాలో     అవేంటో ఇప్పుడే తెలుసుకోండి
Advertisement

Egg For Hair Growth:ఒత్తైన పొడవాటి జుట్టు కావాలని అందరికీ ఉంటుంది. కానీ, నేడు ఉన్న అనేక సమస్యల కారణంగా చాలా మంది జుట్టు రాలుతుంటుంది. దీంతో జుట్టు పల్చగా మారుతుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు గుడ్డు చక్కని సొల్యూషన్ అని చెబుతున్నారు నిపుణులు. గుడ్డుని వాడడం వల్ల జుట్టు పెరుగుతుందని చెబుతున్నారు.గుడ్డు ఆరోగ్యానికే కాదు.. జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని జుట్టుకి అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీలా మారుతుంది. అంతేనా.. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

అమైనోయాసిడ్స్..
సాధారణంగా గుడ్డులో పచ్చసొన, తెల్ల సొన ఉంటుంది. గుడ్డులోని పొచ్చసొనలో మొత్తం కొవ్వు, తెల్లసొనలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. గుడ్డులోని తెల్లసొనలో అవసరమైన అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ ఉంటాయి. గుడ్డులోని తెల్లసొన అన్ని అవసరమైన అమైనో యాసిడ్స్‌ని కలిగి ఉన్న ప్రోటీన్. మీ జుట్టుతో సహా మీ శరీరంలోని కణజాలాలను నిర్వహించడానికి, మీ ఫుడ్‌లో ప్రోటీన్ ఉండాలి.

Advertisement GKSC

మీ ఫుడ్‌లో సరైన మొత్తంలో ప్రోటీన్ ఉంటే మీ బాడీ బలమైన, హెల్దీ జుట్టు పెరిగేలా చేస్తుంది.
ప్రోటీన్ సరిగ్గా తీసుకోవడం వల్ల హెల్దీ జుట్టు ప్రమోట్ అవుతుంది. కొందరు వ్యక్తులు జుట్టు రాలే సమస్యతో బాధపడతారు. అలాంటి వారు గుడ్డులోని తెల్ల సొన హెయిన్ మాస్క్ కూడా వాడొచ్చు.

ఎగ్ మాస్క్ బెనిఫిట్స్..
గుడ్డులోని తెల్లసొన హెయిర్ మాస్క్ అప్లై చేయడం వల్ల స్కాల్ప్‌లోని అదనపు నూనెని క్లీన్ చేస్తుంది. ఇది జుట్టుని బలపరుస్తుంది. పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. చుండ్రుతో పోరాడుతుంది. మీరు గుడ్డులోని తెల్లసొనని హెయిర్ మాస్క్‌గా వాడొచ్చు. దీనిని కొబ్బరి నూనె వంటి ఇతర పోషకాలతో కూడా కలపొచ్చు.

Advertisement
Author Image