For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Benefits of Green Chillies:పచ్చి మిరపకాయ ని వంటల్లో చేర్చుకుంటే ఎన్నో దీర్ఘకాలిక సమస్యల నుండి రక్షిస్తుంది ...

01:32 PM Aug 11, 2023 IST | Sowmya
Updated At - 01:32 PM Aug 11, 2023 IST
benefits of green chillies పచ్చి మిరపకాయ ని వంటల్లో చేర్చుకుంటే ఎన్నో  దీర్ఘకాలిక సమస్యల నుండి రక్షిస్తుంది
Advertisement

Benefits of Green Chillies: పచ్చిమిర్చి లేకుండా అస్సలు మన భారతీయ వంటలు పూర్తి కావు. పచ్చిమిర్చి వంటలకు కారాన్ని ఇవ్వడమే కాదు.. మంచి రుచిని జోడిస్తాయి. పచ్చిమిర్చిలోని క్యాప్సైసిన్‌ అనే రసాయనం కారణంగా అది కారంగా ఉంటుంది. క్యాప్సైసిన్‌ దానికి మెరిసే ఆకుపచ్చ రంగు కూడా ఇస్తుంది. ఇది మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. పచ్చి మిరపకాయలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, పొటాషియం, కాపర్‌, జింక్, సోడియం, మాంగనీస్‌, విటమిన్‌ సి, B1, B2, B3, B6, B5, విటమిన్‌ ఏ, ఫోలేట్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చిమిర్చిని మన ఆహారంలో చేర్చుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.​

దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది..
పచ్చి మిరపకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పచ్చిమిర్చిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినాల్స్‌, ప్రోయాంతోసైనిడిన్స్ వంటి రసాయనాలు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రక్షిస్తాయి. ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ DNA దెబ్బతినడానికి, జన్యు నిర్మాణాన్ని మార్చడానికి, గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్లు వంటి దీర్షకాలిక వ్యాధులు ప్రమాదాన్ని పెంచుతాయి. పచ్చి మిరపకాయ మీ వంటల్లో చేర్చుకుంటే ఈ దీర్ఘకాలిక సమస్యల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

Advertisement GKSC

బ్లడ్‌ షుగర్స్‌ తగ్గిస్తుంది..
పచ్చి మిరపకాయలలో పుష్కలంగా ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాప్సైసిన్ ఇన్సులిన్ స్రావాన్ని ప్రోత్సహిస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

రక్తహీనతను తగ్గిస్తుంది..
ఐరన్‌ లోపం కారణంగా రక్తహీనత తలెత్తుతుంది. పచ్చి మిరపకాయల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇంకా, పచ్చిమిర్చిలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది, ఇది ఐరన్‌ శోషణను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి..
పచ్చి మిర్చిలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు అధిక యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. పచ్చి మిరపకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌ల పెరుగుదల నిరోధిస్తుంది.

Advertisement
Author Image