For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Health Tips : మానసిక ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ మార్గం ఇదే..!

12:36 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:36 PM May 13, 2024 IST
health tips   మానసిక ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ మార్గం ఇదే
Advertisement

Health Tips : ప్రస్తుత జీవన శైలిలో భాగమైన తినే ఆహారం, తదితర మార్పులు కారణంగా మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు వల్ల మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు. ఇక మానసిక ఒత్తిళ్లు తదితర కారణాల వల్ల ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ ఆత్మహత్య చేసుకుంటే సమస్యకు పరిష్కారం కాదని మానసిక నిపుణులు చెబుతున్నా... కొందరు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఎన్నో రకాల కారణాలు వెంటాడుతూ ఆత్మహత్యకు కారణమవుతున్నాయి. అయితే మానసిక ఒత్తిళ్ల నుంచి దూరం కావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో గృహనిలైనా యువత అయిన ఒత్తిడికి లోనవ్వడం అనేది సహజం ముఖ్యంగా ఇంటికే అధికంగా పరిమితమయ్యే మహిళల్లో ఒత్తిడి శాతం అధికంగా ఉంటుంది. ఇలాంటి వాళ్లు కొన్ని టిప్స్ పాటిస్తే సరి. ఏ వయసుకు తగ్గట్టు వారిలో ఒత్తిడి అనేది ఉంటూనే ఉంది. ముఖ్యంగా యువతలో మానసిక ఒత్తిడి, నీరసంగా ఉండడం, కాన్సెంట్రేషన్ తగ్గిపోవడం లాంటివి ఎక్కువ కనిపిస్తూఉంటాయి. ఈరోజుల్లో ఒత్తిడికి ముఖ్యమైన కారణం ఫుడ్ తీసుకోవడంతో పాటు సరైన నిద్ర లేకపోవడం, డిజిటల్ పొల్యూషన్ కి గురికావడం.

Advertisement GKSC

చేతిలో ఫోన్ ఉంటే చాలు గంటలు గంటలు గడిపేతే తెలియని నీరసము వస్తుంది. సోమరితనం ఆవహిస్తుంది. దీనివల్లే ఒత్తిడి అధికమవుతుంది. ఈరోజుల్లో సోషల్ మీడియాలో ఉంటే ఎమోషన్స్ నియంత్రించడం కష్టం. ఒత్తిడిని తగ్గించాలి అంటే కనీసం వారానికి ఒకసారి అయినా సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిది. ఎక్కువ సమయం ఇంట్లో వారితో లేదా ఆత్మీయులతో మాట్లాడటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. లోపల ఉండే ఒంటరితనం అసూయ ద్వేష భావాలు తగ్గిపోతాయి. ఇష్టమైన వ్యక్తులతో కొత్త ప్రదేశాలకు వెళ్లడం వల్ల కూడా ఒత్తిడి తగ్గిపోతుంది. దీంతోపాటు నిజాయితీగా ఉండడము ఐడియల్ గా ఉండడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరులతో కంపారిజన్ వదిలేయాలి. అప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది.

Advertisement
Author Image