For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Health Tips : చుండ్రు సమస్య ఉందా... అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి !

12:39 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:39 PM May 13, 2024 IST
health tips   చుండ్రు సమస్య ఉందా    అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి
Advertisement

Health Tips : చుండ్రు అనేది ఒక రకమైన చర్మవ్యాధి. చుండ్రు అనేది ముఖ్యంగా శ్రద్ధ తీసుకోకపోవడం వలన కూడా వస్తుంది. అయితే చుండ్రు వచ్చిన వారిలో తలలోని చర్మం పైన తెల్లని పొట్టు లాగా రావడము . హెయిర్ ఫాల్ కావడము , మలబద్ధకము, చాతిపై దురదలు రావడం, తల ఎరుపుగా రావడం, మరియు గడ్డం కనుబొమ్మలపై దురదలు రావడం చుండ్రు ఉన్న వారిలో ఇవి కొన్ని లక్షణాలుగా చెప్పవచ్చు.

అయితే ఈ చుండ్రు అనేది ఎక్కువగా చలికాలంలో దీని ప్రభావం మన శరీరం మీద ఎక్కువగా ఉంటుంది. ఈ చుండ్రు వలన మోహము మీద, శరీరము వీపి భాగాన, మెడ క్రింద భాగాన మొటిమలు లాగా వస్తూ ఉంటాయి. ఇది చుండ్రు ఎక్కువగా అవ్వడం వల్ల ఆ చుండ్రు రాలి శరీరం పైన పడి ఆయా భాగాలలో మొటిమలు లాగా రావడము గమనిస్తూ ఉంటాము. ఇందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా...

Advertisement GKSC

▪️చుండ్రు ఉన్నవారు పొల్యూషన్ లో తిరగడం అనేది తగ్గించాలి. పొల్యూషన్ హెయిర్ లోపలికి వెళ్లడం వల్ల చుండ్రు మరి కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.

▪️చుండ్రు ఉన్నవారు రోజు విడిచి రోజు తల స్నానం చేయడం అనేది మంచిదిగా వైద్యులు సూచిస్తున్నారు.

▪️స్త్రీలలో అయితే చుండ్రు ఉన్నవారు తలస్నానం చేసిన తర్వాత తల పూర్తిగా ఆరకుండా జడ వేయడం వలన కూడా చుండ్రు అనేది వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.

▪️చుండ్రు ఉన్నవారు ఇతరుల దువ్వనులను, టవర్లను వాడకుండా ఉండడము మంచిది. వారు వాడేది కూడా ఇతరులకు ఇవ్వకూడదు.

▪️వెంట్రుకలకు రాయడానికి స్వచ్ఛమైన కొబ్బరినూనెను వాడాలి. ఇతర రసాయనాలు బ్రాండ్లతో కూడిన ఆయిల్ రాయడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది.

▪️పోషక ఆహారం లోపం ఏర్పడకుండా సంతులితమైన ఆహారం తీసుకోవడం శరీరానికి ఎంత అవసరం.

▪️నిద్రలేమి ఏర్పడకుండా చూసుకోవాలి.

▪️చుండ్రు ఉన్న వారిలో ఎక్కువగా ఆలోచనల వల్ల కూడా ఈ చుండ్రు వస్తుందని ఎక్కువ ఆలోచించకూడదని వైద్యనిపుణులుతెలుపుతున్నారు.

Advertisement
Author Image