Health Tips : మీకు మంచి నిద్ర కావాలంటే రాత్రి పూట వీటిని తినడం తగ్గిస్తే బెటర్..!
Health Tips : ప్రస్తుత కాలంలో ఆహారం విషయంలో కూడా పలు జాగ్రతలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మనం తినే ఆహారం మన ఆరోగ్యంపై ప్రభావితం చూపిస్తుందనేది వాస్తవం. అయితే పగలు తినే ఆహారాల్లో రాత్రి పూట మాత్రం కొన్నింటిని తక్కువ తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. మారుతున్న కాలానుగుణంగా నేటి జనరేషన్ లో చాలా మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది. రాత్రి సమయంలో మనం తీసుకునే భోజనం కూడా ఈ నిద్రపై ప్రభావం చూపుతుంది. అయితే రాత్రి భోజనంలో పలు ఆహార పదార్దాలను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీకోసం...
పెరుగు : ఇది రాత్రి పూట ఎక్కువగా తినకూడదని... ఎందుకంటే ఇది శ్లేష్మాన్ని ఉత్పత్రి చేసి కఫానికి దారి తీస్తుందని డాక్టర్లు తెలుపుతున్నారు.
కాలీఫ్లవర్ : ఆరోగ్యానికి చాలా మేలు చేసే కూరగాయల్లో కాలీఫ్లవర్ కూడా ఒకటి. కానీ ప్రశాంతమైన నిద్ర కోసం రాత్రి భోజనంలో కాలీఫ్లవర్‌ను తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రాత్రి భోజనంలో సలాడ్‌తో టొమాటోలను ఎప్పుడూ తినకూడదని ... ఇది రాత్రి నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.
బ్రకోలీ : ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. బ్రకోలీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, దీంతో ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది.
రాజ్మా : ఇందులో ఐరన్, కాపర్, ఫోలేట్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సీ వంటి పోషకాలు ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే రాజ్మాను రాత్రి సమయంలో తినకూడదని అంటున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మందగిస్తుంది. అంతే కాకుండా కడుపులో గ్యాస్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
టీ, కాఫీలు : రాత్రి పూట కెఫిన్ పానీయాలు తాగడం వల్ల మీ నిద్రపై ప్రభావం పడుతుంది. అందుకే ఈ ఆహార పదార్దాలను రాత్రి భోజనంలో తక్కువ తీసుకోవడం మంచిది.