Health Tips : చలికాలంలో ఈ రైస్ తింటే చాలా మంచిదట..!
Health Tips : వరి భారతదేశంలో ప్రధాన ఆహార పంట. బియ్యం అనగానే సహజంగా అందరూ తెల్లని బియ్యమే వాడుతూ ఉంటారు. బియ్యం లో 75% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బియ్యంతో సహజంగా అన్నమే కాకుండా రకరకాల వంటలు చేస్తూ ఉంటారు. పులిహార మరమరాలు, ఇడ్లీ ,దోసె, ఉప్మా, బొరుగులు పరమాన్నం ఇలా చాలా రకాలు బియ్యంతో సహజంగా వంటకాలు స్త్రీలు చేస్తూ ఉంటారు.
అయితే తెల్ల బియ్యం తినడం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు. చలి కాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది అంటారు కదా బ్రౌన్ రైస్ తినాలా లేదా తెల్ల బియ్యమే తింటే మంచిదా... అనే అనుమానం సహజంగా మనందరిలో ఉంటుంది. కాగా ఉష్ణోగ్రతలు పడిపోయే చలికాలంలో జీర్ణక్రియ వేగం కొంతవరకు తగ్గుతుంది. కానీ దీనికి ముఖ్య కారణం చలికాదు. చలి కాలంలో శరీరాన్ని శ్రమకు తక్కువగా ఉంచడం వల్ల జీవక్రియ వేగం తగ్గుతుంది.
శారీరిక శ్రమ సక్రమంగా ఉంటే క్రియ మందగించడం లాంటిది ఉండదు. ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తే తీసుకునే ఆహారం మోతాదు తగ్గించడం మంచిది. క్యాలరీలు అధికంగా ఇచ్చే స్వీట్లు ,పిండి వంటలు, వేయించిన ఆహారం లాంటివి తగ్గించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు . తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్ లో విటమిన్లు ఖనిజాలు కాస్త అధికంగా ఉంటాయి. కాకుండా పీచు పదార్థం రెండిట్లోనూ దాదాపు ఒకేలాగా ఉంటుంది. బ్రౌన్ రైస్ కొంత సమయం వరకు నానబెట్టి వండినప్పుడు అరుగుదల లో కూడా ఎటువంటి తేడా ఉండదు. కాబట్టి శీతకాలంలోనూ ఆరోగ్యం కోసం బ్రౌన్ రైస్ తినడమే మేలు. చలి ఉన్నా కూడా వ్యాయామం మానేయకుండా ఉంటే జీర్ణశక్తిలో తేడా కూడా రాదు ఉన్నారు వైద్య నిపుణులు.