Health Tips : కాలీ ఫ్లవర్ తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే... ఇక రోజు తింటారేమో !
12:30 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:30 PM May 13, 2024 IST
Advertisement
Health Tips : కాలీఫ్లవర్... మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు పుష్కలంగా లభించే వాటిలో ఒకటి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయడంలో కాలీ ఫ్లవర్ బాగా పని చేస్తుంది. కాలీఫ్లవర్ తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. అలానే చర్మ ఆరోగ్యానికి కూడా కాలీ ఫ్లవర్ బాగా ఉపకరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, శరీరంలోని మలినాలను శుభ్రపరిచేందుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మరెన్నో ఉపయోగాలు కాలీ ఫ్లవర్ వల్ల ఉన్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా...
- క్యాలీఫ్లవర్ తినడం వల్ల శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.
- క్యాలీఫ్లవర్ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- కాలీఫ్లవర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరం నుండి అన్ని హానికరమైన పదార్థాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.
- క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇది చాలా ముఖ్యం.
- కాలీఫ్లవర్‌లో ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి తగినంత కాల్షియం ఉంటుంది. కాలీఫ్లవర్‌లోని ప్రయోజనకరమైన పదార్థాలు సూర్యుని యొక్క అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. ఇది చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
- కాలీఫ్లవర్ జుట్టుతో పాటు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. జుట్టు పల్చబడటం లేదా జుట్టు రాలడం వంటి సమస్యలు ఉన్నవారికి, నిపుణులు తమ రెగ్యులర్ ఫుడ్ లిస్ట్‌లో కాలీఫ్లవర్‌ను చేర్చుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.
- జుట్టు సాంద్రతను పెంచడంలో, జుట్టును మెరిసేలా చేయడంలో ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని చెబుతున్నారు.
- అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి కూడా కాలీఫ్లవర్ చాలా మేలు చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
- కాలీఫ్లవర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే, శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.
- కాలీఫ్లవర్‌లో భాస్వరం, మాంగనీస్, మెగ్నీషియం మరియు జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఎముకల సాధారణ పనితీరుకు మరియు బలోపేతం కావడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.
Advertisement

