For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telangana News: గాంధీ ఆసుపత్రిలో రూ. 2 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ప్రారంభించిన ఆరోగ్య మంత్రి హరీశ్ రావు

01:19 PM Dec 11, 2021 IST | Sowmya
Updated At - 01:19 PM Dec 11, 2021 IST
telangana news  గాంధీ ఆసుపత్రిలో రూ  2 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ప్రారంభించిన ఆరోగ్య మంత్రి హరీశ్ రావు
Advertisement

గాంధీ ఆసుపత్రిలో రూ. 2 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ప్రారంభించిన ఆరోగ్య మంత్రి హరీశ్ రావు గారి మాటల్లో... గాంధీలో 6.5 కోట్లతో నూతన క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం, 12.5 కోట్లతో MRI ఏర్పాటు చేస్తున్నాం, ఈ రెండూ వచ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం, మాతాశిశు సేవల కోసం గాంధీలో 200 పడకల MCH నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి, వచ్చే ఐదారు నెలల్లో పనులు పూర్తి కానున్నాయి, కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రి సిబ్బంది అద్భుతంగా సేవలు చేశారు. 84,127 మందికి వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. దవాఖాన లోని సిబ్బంది అందరికీ నా అభినందనలు, ప్రైవేట్ దావకానలు చేతులెత్తేసిన సమయంలో గాంధీ దవాఖాన ప్రజలను ఆదుకుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ దవాఖాన పై ప్రత్యేక దృష్టి పెట్టారు. టిఆర్ఎస్ ప్రభుత్వం దవాఖానకు ఇప్పటివరకు రు. 176 కోట్లు విడుదల చేసింది. ఇందులో 100 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 76 కోట్ల పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి, రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదు. రిస్క్ దేశాలనుంచి 3235 మందిరాగా వారిలో 15 మంది కి పాజిటివ్ వచ్చింది. జీనోమ్ సీక్వెన్సింగ్ లో 13 మందికి నెగెటివ్ వచ్చింది. మరో ఇద్దరు ఫలితాలు రావాల్సి ఉంది.

Advertisement GKSC

రాష్ట్రంలో ఇప్పటివరకు 4.6 కోట్ల కరోనా టీకాలు వేశారు. 95 శాతం మందికి మొదటి డోస్, 51 శాతం మందికి రెండో వేశారు, ఎలాంటి వైరస్ వచ్చినా మాస్క్ మనకు శ్రీరామరక్ష. కాబట్టి ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి. రెండు డోసుల టీకాలు వేసుకోవాలి.

Health Minister Harish Rao inaugurated the CT scan set up worth Rs 2 crore in Gandhi Hospital,Minister Talasani Srinivas Yadav,Telangana News,telugu golden tv,teluguworldnow.com,v9 news telugu.

Advertisement
Author Image