Health వెల్లుల్లి తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలు..
Health పురాతన కాలం నుంచి భారతీయ వంటకాల్లో భాగం అయిపోయింది వెల్లులి.. రుచిక కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే వెల్లుల్లిని రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో వెల్లులిను ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం..
వెల్లులి భారతీయ వంటింట్లో నిత్యం ఉండే వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఆరోగ్య సమస్యలను దూరం చేయటంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాగే దీంట్లో ఉండే ఆంటీ వైరల్ గుణాలు వర్షాకాలం చలికాలంలో వచ్చే ఎన్నో రుగ్మతల నుండి కాపాడుతుంది.. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శరీరానికి ఔషదంగా పనిచేస్తుంది. అలాగే క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులను, మధుమేహాన్ని తగ్గించడంలోనూ వెల్లుల్లి ప్రముఖ పాత్ర వహిస్తుంది..
అలాగే రోజు ఉదయాన్నే రెండు పచ్చి వెల్లుల్లి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అలాగే శరీరానికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా వెల్లుల్లి సహకరిస్తుంది.. బాలింతలు వెల్లుల్లి పొడిని అన్నంలో కడుక్కుని తినడం వల్ల డెలివరీ అనంతరం వచ్చే చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు.. ఇందులో ఉండే యాంటీ క్లాటింగ్ గుణాలు శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా కాపాడుతాయి. ముఖ్యంగా గుండె జబ్బుతో బాధపడే వారు వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగుపడి..ఆరోగ్యంగా ఉంటారు.