For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Health: దానిమ్మ పండు… పోషకాలు మెండు.. దీని ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా..?

02:00 PM May 03, 2024 IST | Sowmya
Updated At - 02:00 PM May 03, 2024 IST
health  దానిమ్మ పండు… పోషకాలు మెండు   దీని ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా
Advertisement

Health Benefits With Pomegranate, Health News, Health Tips, Telugu World Now

Health: దానిమ్మ పండు… పోషకాలు మెండు.. దీని ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా..?

Advertisement GKSC

Health Benefits With Pomegranate: దానిమ్మ పండు వలన ఉపయోగాలు :

కాలంతో సంబంధం లేకుండా ప్రతీ సీజన్‌లో అందుబాటులో ఉండే పండ్లలో దానిమ్మ ఒకటి. చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ పండుతో అంతే ప్రయోజనాలుంటాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే దానిమ్మ గింజలతో ఆరోగ్యానికి జరిగే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* దానిమ్మ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తుంది.

* గుండె జబ్బులకు చెక్‌ పెట్టడానికి కూడా దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. రోజుకో గ్లాసు దానిమ్మ రసం తాగితే హృదయ సంబంధిత రోగాలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు.

* గర్భిణీలు కచ్చితంగా దానిమ్మను ఆహారంలో ఓ భాగం చేసుకోవాలి. దీనివల్ల గర్భస్త శిశువు బాగా ఎదుగుతుంది.

ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.

* దానిమ్మపండులో ఉండే పోషక విలువలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. ఈ కారణంగా గుండె పోటు వచ్చే ప్రమాదం తప్పించుకోవచ్చు.

* దానిమ్మ పండు కేవలం ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది. దానిమ్మ రసంలో ఒక స్పూన్‌ పంచదార, ఒక స్పూన్‌ తేనె వేసిన ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.

* పైల్స్‌ సమస్యకు కూడా దానిమ్మ మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయం దానిమ్మ గింజలకు కొంచెం ఉప్పును కలుపుకొని తింటే.. పైల్స్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

Advertisement
Author Image