Health Tips:ఆ సమస్యతో బాధపడే వారికి.. బెస్ట్ మెడిసిన్ గుమ్మడికాయ గింజలే !!
Health Tips: భారతీయులు అధికంగా ఉపయోగించే వంటకాల్లో గుమ్మడికాయ కూడా చెప్పుకోవచ్చు అయితే చాలామంది గుమ్మడికాయ వంటకాన్ని అంత ఇష్టపడరు అని చెప్పాలి. ఎందుకంటే గుమ్మడికాయని సహజంగా ఇంటిముందు దిష్టికే పరిమితం అని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ గుమ్మడికాయతో కూర వండితే మాంసం కూడా సరిపోదు అంతా రుచిగా ఉంటుంది. అలానే గుమ్మడి విత్తనాలు ద్వారా కూడా మనం గుమ్మడి విత్తనాలు ఆహారంగా తీసుకోవడం ద్వారా మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇటువంటి గుమ్మడిలో పలు లాభాలు ఏంటో తెలుసుకుందామా మరి.
గుమ్మడి విత్తనాలను అధిక బరువు ఉన్నవారు పరగడుపున తీసుకోవడం ద్వారా మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. గుమ్మడి విత్తనాల్లో కొవ్వు శాతాన్ని పరిమాణస్థితిలోనే ఉంచుతుంది చెడు కొలెస్ట్రాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు గుమ్మడి విత్తనాలను గుమ్మడి కోరను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ గింజలను ఉదయాన్నే తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించవచ్చు. గుమ్మడి గింజల్లో కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, పొటాషియం, జింక్ లాంటి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. ఈ గుమ్మడి గింజలను తీసుకోవడం ద్వారా వల్ల కండరాలు, ఎముకల నొప్పి, జుట్టు రాలడం, మొటిమలను రాకుండా సహాయపడుతాయి. గుండెపోటు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఉదయాన్నే గుప్పుడు గుమ్మడి గింజలు తీసుకోవడం ద్వారా గుండె సమస్యలు నుండి ఉపశమనం పొందవచ్చు. స్పెర్మ్ సమస్య ఉన్నట్లయితే ప్రతిరోజూ గుమ్మడికాయ గింజలను తీసుకోవడం ద్వారా స్పెర్మ్ సంఖ్యను పెంచుకోవచ్చు. ఇది కేవలం గుమ్మడి విత్తనాలపై కనిపించే కలిగించే అవగాహన మాత్రమే ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వెంటనే డాక్టర్ను సంప్రదించవలెను.
