Harikatha Web Series : డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన "హరికథ" వెబ్ సిరీస్
Disney Plus Hotstar : సరికొత్త కంటెంట్ ను ఎప్పటికప్పుడు ఓటీటీ లవర్స్ కు అందిస్తోన్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ "హరికథ" అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ ను తీసుకొచ్చింది. హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ రోజు నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. "హరికథ" వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మ్యాగీ "హరికథ" సిరీస్ కు దర్శకత్వం వహించారు. దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
మైథాలజీ టచ్ తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "హరికథ" వెబ్ సిరీస్ లో వైవిధ్యమైన కథా కథనాలు, యాక్షన్ ఎపిసోడ్స్, సీజీ వర్క్, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్ వంటి మెయిన్ లీడ్ యాక్టర్స్ పర్ ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. హాట్ స్టార్ కు మరో సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ను అందిస్తూ "హరికథ" ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Cast : Divi, Pujitha Ponnada, Rajendra Prasad, Sriram, Mounika Reddy, Arjun Ambati, Ruchira Sadhineni, Shriya Kottam, Usha Sri, and others.
Technical Team : Art: Kiran Mangodi, Editor: Junaid Siddiqui, DOP: Vijay Ulaganath, Music Director: Suresh Bobbili, Writer: Suresh Jai, Executive Producers: Rammohan Reddy, Sujith Kumar Chowdhury Kolli, Shashikiran Narayana, PRO: GSK Media (Suresh - Sreenivas), Co-Producer: Vivek Kuchibotla, Producer: TG Vishwaprasad, Direction: Maggi