For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Nature's Lap : మై స్కూల్ ఇటలీ నేచర్స్ లాప్ ను 9వ నిజాం నవాబ్ రౌనత్ యార్ ఖాన్ తో కలిసి ప్రారంభించిన హనుమాన్ హీరో తేజ సజ్జ

04:10 PM Feb 19, 2024 IST | Sowmya
Updated At - 04:10 PM Feb 19, 2024 IST
nature s lap   మై స్కూల్ ఇటలీ నేచర్స్ లాప్ ను 9వ నిజాం నవాబ్ రౌనత్ యార్ ఖాన్ తో కలిసి ప్రారంభించిన హనుమాన్ హీరో తేజ సజ్జ
Advertisement

యూరోపియన్ న్యూరో బేస్డ్ మై స్కూల్ ఇటలీ సంస్థ జూబ్లీహిల్స్ లో ఇండియాలోనే తొలిసారిగా నేచర్స్ లాప్ పేరుతో ప్రీ స్కూల్, కిండర్ గార్డెన్ స్కూల్ ను ఏర్పాటు చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 లో ఏర్పాటుచేసిన ఈ స్కూల్ ని హనుమాన్ సినిమా హీరో తేజ సజ్జ ముఖ్య అతిథిగా విచ్చేసి 9వ నిజాం నవాబ్ రౌనత్ యార్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగు గోడల మధ్య చదువుకు అలవాటు పడిన పిల్లలకు ఈ ప్రకృతి ఒడిలో పాఠాలు కొత్త అనుభూతినిస్తాయని అన్నారు. పిల్లలకు చిన్న వయసు నుంచే ప్రకృతికి మనకున్న అనుబంధాన్ని తెలియజేసేలా దీన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తాను తాను నటించిన హనుమాన్ మూవీకి ఇప్పుడే సీక్వెల్ చేయమని కొంత సమయం తీసుకుంటామని ఈ మధ్యలో వేరే సినిమాలు చేస్తామని అన్నారు.

Advertisement GKSC

సంస్థ ఫౌండర్ చైర్మన్ ప్రసాద్ గారపాటి మాట్లాడుతూ... ఇటలీ స్కూల్స్ లో ముఖ్యంగా సహజత్వానికి దగ్గరగా, ప్రాక్టికల్ గా పాఠాలు బోధిస్తారని, తనకు విద్యపై ఉన్న మక్కువతో ఈ ప్రకృతి ఒడిలో పాఠాలు అనే కాన్సెప్ట్ ను తీసుకొచ్చానని అన్నారు. రౌనత్ యార్ ఖాన్ కు చెందిన ఈ స్థలంలో రెండెకరాల విస్తీర్ణం లో చిన్నారులకు రంగులు, పూలు, పక్షులు ఇలా ప్రతి విషయాన్ని ప్రకృతిలో అండర్ ద స్కై అనే కాన్సెప్ట్ లో బోధిస్తామని అన్నారు. మరో ఏడాది కాలంలో 150 నూతన బ్రాంచెస్ ను తెరిచేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండి అపర్ణ వెల్లూరు, సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, ఇటాలియన్ ఎంబసీ ప్రతినిధి డాక్టర్ మరియా డానియల్ , ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ డాక్టర్ డి సుధాకర్ రావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Hanuman Movie Hero Teja Sajja Inaugurates My School ITALY’s 'Nature's Lap' A Unique Initiative by European Neuroscience Based Preschool copy,

Advertisement
Author Image