Crime : గుంటూరు వైద్య విద్యార్థిని మర్డర్ కేస్ లో కీలకంగా మారనున్న ఆ అమ్మాయి వాంగ్మూలం..
Crime గుంటూరులో వైద్య విద్యార్థిని తపస్వి మర్డర్ కేసులో ఓ అమ్మాయి వాంగ్మూలం కీలకంగా మారింది అమ్మాయిని మర్డర్ చేస్తున్న సమయంలో పక్కనే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అమ్మాయి ఇప్పుడు కనిపించడం లేదు తన దొరికితేనే అసలు విషయాలు బయటకు వస్తాయని తెలుస్తోంది..
నిన్న గుంటూరులో వైద్య విద్యార్థిని తపస్వీపై ఓ వ్యక్తి బ్లడ్ తో దాడి చేసే గొంతు కోసం చంపేసిన సంగతి తెలిసిందే.. అయితే తపస్విపై జ్ఞానేశ్వర్ ఎటాక్ చేసినప్పుడు ఆమె స్నేహితురాలు పక్కనే ఉంది ఆమె ప్రత్యక్ష సాక్షి కూడా అయితే హాస్పిటల్ లో అడ్మిట్ అయిన తర్వాత ఆ అమ్మాయి అసలు అక్కడినుంచి మాయమైంది అయితే ఆ అమ్మాయి ఎవరు ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది? అసలు మర్డర్ ఎలా జరిగింది అన్నయ్య విషయాలన్నీ తెలియాలి అంటే కచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే.. అలాగే తపస్విపై జ్ఞానేశ్వర్ ఎటాక్ చేసినప్పుడు ఆమె ఫ్రెండ్ విభ కూడా రూమ్‌లోనే ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇద్దరికీ జ్ఞానేశ్వర్‌తో పరిచయం ఉన్నట్లు తేలింది. వీళ్లిద్దరూ రూమ్‌లో ఉండగానే లోపలికొచ్చిన జ్ఞానేశ్వర్… పెళ్లి చేసుకుంటావా? లేదా? అంటూ తపస్విని బెదిరించడం, ఆమె ససేమిరా అనడం, సర్జికల్ బ్లేడ్‌తో ఎటాక్ చేయడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయ్. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో విభానే ప్రత్యక్ష సాక్షి కావడంతో ఈ కేసులో ఆమె కీలకంగా మారింది. అయితే ఆమె మాట తర్వాత వీళ్ళు ఎవరు అక్కడ కనిపించకపోవడంతో పోలీసులు కేసును ఎలా చేదించాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అయితే కుటుంబ సభ్యులు వచ్చి.. తపస్వి డెత్‌తో విభ షాక్‌లో ఉందంటున్నారు.. అయితే అసలు విషయాలు తెలియాలి అంటే మాత్రం వీరందరూ దొరకాల్సి ఉంది కాగా దోషి పై 342, 452, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు జ్ఞానేశ్వర్‌ను రేపు కోర్టులో హాజరుపర్చనున్నారు.