ప్రపంచ ఫార్మసీ దినోత్సవం సందర్భంగా ఫార్మసిస్ట్ లకు శుభాకాంక్షలు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
Advertisement 
వైద్య రంగంలో ఫార్మసీ రంగం పాత్ర గణనీయమైనది. ఫార్మసీకి అర్థం ఔషధ కల్పన శాస్త్రం లేదా ఔషధ వితరణశాల. ఫార్మసీ చదివిన నిపుణులు ఫార్మసిస్ట్ లు. ప్రజలకు నేరుగా సేవలు అందించే వారు కమ్యూనిటీ ఫార్మసిస్ట్ లు, హాస్పిటల్ ఫార్మసిస్ట్ లు. ఫార్మసీ రంగంలో కమ్యూనిటీ ఫార్మసిస్ట్ లు, హాస్పిటల్ ఫార్మసిస్ట్ లు, పారిశ్రామిక ఫార్మసిస్ట్ లు, ఫార్మసీ శాస్త్రవేత్తలు, ఫార్మసీ అధ్యాపకులు, ఔషధ నియంత్రణ అధికారులు అందరికీ ప్రపంచ ఫార్మసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు!
వైద్య రంగంలో ఫార్మసిస్ట్ ల పాత్ర విస్మరించలేనిది. అంతా వ్యష్టిగా, సమష్టిగా నిత్యం నిరంతరం కృషి చేస్తున్నందు వల్లనే కరోనా ను ఎదుర్కోవడం సాధ్యమైంది. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.
Advertisement  
