For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

టీఎస్‌పీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ: మంత్రి హరీశ్‌రావు

03:49 PM May 11, 2024 IST | Sowmya
UpdateAt: 03:49 PM May 11, 2024 IST
టీఎస్‌పీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ  మంత్రి హరీశ్‌రావు
Advertisement

రాష్ట్రంలో ఉద్యోగాల జాతరలో భాగంగా మరో 2,440 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. విద్యాశాఖతో పాటు, స్టేట్‌ ఆర్కైవ్స్‌ డిపార్ట్‌మెంట్లలో పోస్టుల భర్తీకి అనుమతిఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కే రామకృష్ణారావు శుక్రవారం 5 వేర్వేరు జీవోలను జారీ చేశారు. ఇంటర్‌ విద్యలో 1,523 పోస్టులకు జీవో-117, కళాశాల విద్యలో 544 పోస్టులకు జీవో-118, సాంకేతిక విద్యలో 359 పోస్టులకు జీవో-116, స్టేట్‌ ఆర్కైవ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 8 పోస్టులకు జీవో-114, ఇదే ఇన్‌స్టిట్యూట్‌లో 6 రిసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు జీవో-115ను జారీచేశారు. వీటన్నింటినీ టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతిచ్చారు. వీటిలో ఇంటర్‌ విద్యలో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు, 40 లైబ్రేరియన్‌, 91 ఫిజికల్‌ డైరెక్టర్‌, ఆర్కైవ్స్‌ విభాగంలో 14, సాంకేతిక విద్యాశాఖలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చరర్‌, 14 ఇన్‌స్ట్రక్టర్‌, 31 లైబ్రేరియన్‌, 5 మ్యాట్రన్‌, 25 ఎలక్ట్రీషియన్‌, 37 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులున్నాయి. కళాశాల విద్య (డిగ్రీ కాలేజీల్లో) 491 లెక్చరర్‌, 24 లైబ్రేరియన్‌, 29 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులున్నాయి.

అధ్యాపక పోస్టులే ఎక్కువ
ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టుల్లో అధ్యాపక పోస్టులే అత్యధికం. ఇంటర్‌ విద్యలో 1,392 జేఎల్‌, కళాశాల విద్యలో 491 డీఎల్‌, సాంకేతిక విద్యలో 247 అధ్యాపక పోస్టులున్నాయి. శాఖల వారీగా ఇండెంట్లు చేరగానే నోటిఫికేషన్లు విడుదలవుతాయి. ఇంటర్‌ విద్యలో 2008 తర్వాత జేఎల్‌ పోస్టుల భర్తీ జరగలేదు. 14 ఏండ్ల తర్వాత ఇప్పుడు నింపనున్నారు.

Advertisement

భర్తీలో వ్యూహాత్మకంగా సర్కారు
పోస్టుల భర్తీలో సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఒకేసారి అన్ని పోస్టులను భర్తీ చేయకుండా అర్హతలను బట్టి క్రమంగా అనుమతులు మంజూరు చేస్తున్నది. ఇప్పటికే డిగ్రీ అర్హత గల వారికి గ్రూప్‌-1, యూనిఫాం సర్వీసుల కోసం వేచిచూస్తున్న వారికి హోం, ఎక్సైజ్‌, రవాణా శాఖల్లో పోలీసు ఉద్యోగాలు, బీఈడీ అర్హత గల వారికి గురుకుల టీచర్‌ పోస్టులు, బీటెక్‌ అర్హత గల వారికి అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. తాజాగా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ అర్హత గల వారికోసం అధ్యాపక పోస్టులకు ఆమోదం తెలిపింది. దీంతో అన్ని రకాల అర్హతలు గల వారు ఉద్యోగాలకు పోటీ పడే అవకాశాన్నిచ్చింది.

మొత్తంగా 49 వేలకు ఉద్యోగాలకు ఓకే
ఉద్యోగాల భర్తీలో మొత్తంగా 91,142 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. వీటిల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు మినహాయిస్తే 80,039 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా ఇప్పటికే 46,988 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. తాజాగా 2,440 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. దీంతో ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన పోస్టు సంఖ్య 49,428కి చేరింది.

ఉద్యోగాల వర్షం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల వర్షం కురుస్తున్నది. దూరదృష్టి గల సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఉద్యోగాల సీజన్‌ నడుస్తున్నది. మరో 2,440 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు 49,428 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీచేసేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
– ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

ఉన్నత విద్యాశాఖ
(స్టేట్‌ ఆర్కైవ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)
పోస్టు పేరు పోస్టుల సంఖ్య

★ ఆర్కివిస్ట్‌ 02

★ అసిస్టెంట్‌ ఆర్కివిస్ట్‌ 02

★ అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ 01

★ రిసెర్చ్‌ అసిస్టెంట్‌ 01

★ సీనియర్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్‌ 01

★ జూనియర్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్‌ 01

★ మొత్తం 08

ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్య
( స్టేట్‌ ఆర్కైవ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)
★ రిసెర్చ్‌ అసిస్టెంట్‌ 06

ఉన్నత విద్యాశాఖ (సాంకేతిక విద్య)
పోస్టు పేరు పోస్టుల సంఖ్య

★ ఆర్కిటెక్చరల్‌ ఇంజినీరింగ్‌ 04

★ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ 15

★ బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ 03

★ కెమికల్‌ ఇంజినీరింగ్‌ 01

★ కెమిస్ట్రీ 08

★సివిల్‌ ఇంజినీరింగ్‌ 82

★ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ 24

★ ఎలక్రాన్టిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 41

★ ఎలక్రాన్టిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 01

★ ఫుట్‌వేర్‌ టెక్నాలజీ 05

★ జియాలజీ 01

★ లెటర్‌ ప్రెస్‌ 05

★ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 36

★ మెటలర్జీ 05

★ ప్యాకింగ్‌ టెక్నాలజీ 03

★ ఫార్మసీ 04

★ ఫిజిక్స్‌ 05

★ ట్యానరీ 03

★ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ 01

★ జూనియర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ 14

★ లైబ్రేరియన్‌ 31

★ మ్యాట్రన్‌ 05

★ ఫిజికల్‌ డైరెక్టర్‌ 37

★ ఎలక్ట్రీషియన్‌ 25

★ మొత్తం 359

ఉన్నత విద్యాశాఖ (కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌)
పోస్టుల పేరు పోస్టుల సంఖ్య

★ ఇంగ్లిష్‌ 23

★ తెలుగు 27

★ ఉర్దూ 02

★ సంస్కృతం 05

★ స్టాటిస్టిక్స్‌ 23

★ మైక్రోబయాలజీ 05

★ బయో టెక్నాలజీ 09

★ అలైడ్‌ న్యూట్రిషన్‌ 05

ఉన్నత విద్యాశాఖ (ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌)
పోస్టు పేరు పోస్టుల సంఖ్య

★ అరబిక్‌ 02

★ బోటనీ 113

★ బోటనీ 15 (ఉర్దూ మీడియం)

★ కెమిస్ట్రీ 113

★ కెమిస్ట్రీ 19(ఉర్దూ మీడియం)

★ సివిక్స్‌ 56

★ సివిక్స్‌ 16 (ఉర్దూ మీడియం)

★ సివిక్స్‌ (మరాఠీ) 01

★ కామర్స్‌ 50

★ కామర్స్‌ 07 (ఉర్దూ మీడియం)

★ ఎకనమిక్స్‌ 81

★ ఎకనమిక్స్‌ 15 (ఉర్దూ మీడియం)

★ ఇంగ్లిష్‌ 153

★ ఫ్రెంచ్‌ 02

★ హిందీ 117

★ హిస్టరీ 60

★ హిస్టరీ 12 (ఉర్దూ మీడియం)

★ హిస్టరీ / సివిక్స్‌ 17

★ హిస్టరీ 05 (ఉర్దూ మీడియం)

★ హిస్టరీ / సివిక్స్‌ 01 (మరాఠి మీడియం)

★ మ్యాథ్స్‌ 154

★ మ్యాథ్స్‌ 09 (ఉర్దూ మీడియం)

★ ఫిజిక్స్‌ 112

★ ఫిజిక్స్‌ 18(ఉర్దూ మీడియం)

★ సంస్కృతం 10

★ తెలుగు 60

★ ఉర్దూ 28

★ జువాలజీ 128

★ జువాలజీ 18 (ఉర్దూ మీడియం)

★ లైబ్రేరియన్‌ 40

★ ఫిజికల్‌ డైరెక్టర్‌ 91

★ మొత్తం 1,523

★ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్‌ 311

★ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ 39

★ కామర్స్‌ బిజినెస్‌ అనలైటిక్స్‌ 08

★ డెయిరీ సైన్స్‌ 08

★ క్రాప్‌ ప్రొడక్షన్‌ 04

★ డాటా సైన్స్‌ 12

★ ఫిషరీస్‌ 03

★ కామర్స్‌ ఫారన్‌ ట్రేడ్‌ 01

★ కామర్స్‌ ట్యాక్సెస్‌ 06

★ లైబ్రేరియన్‌ 24

★ ఫిజికల్‌ డైరెక్టర్‌ 29

★ మొత్తం 544

Advertisement
Tags :
Author Image