For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS : శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి పాన్ ఇండియా మూవీ "45" టీజర్ లాంఛ్

02:41 PM Apr 16, 2025 IST | Sowmya
Updated At - 02:41 PM Apr 16, 2025 IST
film news   శివరాజ్ కుమార్  ఉపేంద్ర  రాజ్ బి శెట్టి పాన్ ఇండియా మూవీ  45  టీజర్ లాంఛ్
Advertisement

45 Movie: శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "45". ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా "45" సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

హీరో ఉపేంద్ర మాట్లాడుతూ - 45 మూవీలో నన్ను చాలా కొత్తగా చూపించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఆయన కథ చెప్పేందుకు వచ్చినప్పుడు నేను ఇంట్లో కాజువల్ గా ఉన్నాను. అది చూసి ఈ మూవీలో నా గెటప్ అలాగే ఉండాలని డైరెక్టర్ చెప్పారు. ఈ చిత్రంలో ఓం సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ను ఎంతో క్రియేటివ్ గా ఈ మూవీలో ఉపయోగించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఆయన వందకు పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అందులో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అలాంటి క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రంతో దర్శకుడు కావడం సంతోషంగా ఉంది. శివరాజ్ కుమార్ గారితో ఓం సినిమా రూపొందించాను.

Advertisement GKSC

ఆ సినిమా షూటింగ్ రెండో రోజే నేను గొప్ప దర్శకుడిని అవుతానని మీడియా ముందు చెప్పారు. శివన్న అలా చెప్పడం చూసి నేను కంగారుపడ్డాను. లేదు నువ్వు దర్శకుడిగా గొప్ప స్థాయికి వెళ్తావని చెప్పారు. ఆయనతో కలిసి ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. 45 మూవీ స్టోరీ ఎంటి, మా క్యారెక్టర్స్ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఇందులో క్లాస్, మాస్, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. కూలీ సినిమాలో రజినీకాంత్, నాగార్జున గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. రజినీకాంత్ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. అన్నారు.

Artists : Shivaraj kumar,upendra, Raj b setty

Banner: Suraj production
Story, music, Director: Arjun janya
Producers: smt :uma Ramesh Reddy, M.ramesh reddy
Cinematography: Satya hegde
Editor:km prakash
Dialogues:Anilkumar
Art:Mohan pandith
PRO: veerababu

Advertisement
Author Image