For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

HEALTH NEWS: దేవుడి ప్రసాదాలలో రోగనిరోధక శక్తిని పెంచే ఏఏ పోషక విలువలు ఉంటాయో తెలుసా?

02:59 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:59 PM May 11, 2024 IST
health news  దేవుడి ప్రసాదాలలో రోగనిరోధక శక్తిని పెంచే ఏఏ పోషక విలువలు ఉంటాయో తెలుసా
Advertisement

Good For Health Devudi Prasadams in Temples, imunity Power, Pulihora, Daddojanam, Uses of Devudi Prasadams, Health News, Bhakthi News,

HEALTH NEWS: దేవుడి ప్రసాదాలలో రోగనిరోధక శక్తిని పెంచే ఏఏ పోషక విలువలు ఉంటాయో తెలుసా?

Advertisement GKSC

సాధారణంగా మనం ప్రతిరోజూ లేదా వారానికి ఒకటి రెండు రోజులైనా ఏదో ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని ప్రసాదాన్ని తీసుకుంటాం. కొందరు మరోసారి అడిగి మరీ తీసుకుని తింటారు. అంతేగానీ, ఏ ప్రసాదంలో ఎన్ని పోషక విలువలుంటాయో, రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుతాయో చాలామంది పట్టించుకోరు. మన ఆధ్యాత్మిక అంశాల్లోనూ వైజ్ఞానికత, ఆరోగ్యపరమైన అంశాలు ఏమేం వున్నాయో ఒక్కసారి చూద్దాం...!!

*బియ్యం, పెసరపొప్పు, జీలకర్ర, ఇంగువ, నెయ్యి, అల్లం, శొంఠిపొడి, ఉప్పు, కరివేపాకు, జీడిపప్పుల మిశ్రమంతో తయారయ్యే కట్టె పొంగలి రోగ నిరోధకశక్తినీ, జీర్ణశక్తినీ పెంచి, ఆకలిని కలిగిస్తుంది.

*బియ్యం, చింతపండు పులుసు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, ఇంగువ, పసుపు, బెల్లం, నూనె, వేరు శనగలు, జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది.

*బియ్యం, పెరుగు, ఇంగువ, కొత్తిమీర, అల్లం, మిర్చి, శొంఠి కలిపి తయారు చేసే ఈ ప్రసాదం మేధస్సును పెంచుతుంది. శరీరానికి శక్తినిచ్చి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.

*బియ్యం, చింతపండు, ఎండు మిర్చి, పోపులు, ఇంగువ, నూనె, ఉప్పు, కందిపప్పు, పసుపు, బెల్లం, నెయ్యి, బెండకాయ, వంకాయ, గుమ్మడికాయ, చిక్కుళ్లు, బీన్స్, దోసకాయ, క్యారెట్, టమాట, చిలకడ దుంపల మిశ్రమంతో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం. సప్త ధాతువుల పోషణనిచ్చి, నిత్య యవ్వనంగా వుంచుతుంది. ఈ ప్రసాదం అన్ని వయస్సుల వారికీ మంచి పౌష్టికాహారం!!

*పచ్చి శనగపప్పు, బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల మిశ్రమంతో ఈ ప్రసాదం సప్తధాతువుల పోషణనిస్తుంది. శ్లేష్మాన్ని తగ్గించే ఈ ప్రసాదం మంచి బలవర్థకం.

*బియ్యప్పిండి, బెల్లం, యాలకలు, నెయ్యి, పచ్చ కర్పూరం, జీడిపప్పు, ఎండు కొబ్బరి కోరుతో తయారు చేసే చలిమిడి ఎంతో శక్తినిస్తుంది.

*కొబ్బరి పాలు, పచ్చ కర్పూరం, యాలకుల పొడి, బాదంపప్పు, కుంకుమపువ్వు, పంచదార, ఆవు పాలు, కలకండ పొడితో చేసే ఈ ప్రసాదం తక్షణ శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్లేష్మాన్ని హరిస్తుంది.

ముక్తి కోసం భక్తితో దేవాలయానికెళ్లి దైవ దర్శనం చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించే భక్తులకు శక్తిని కూడా ఇస్తుంది.

how many types of devudi prasadams in temples good for health,imunity power in prasadam,bhakthi news,health news,pulihora,daddojanam,teluguworldnow.com,

Advertisement
Author Image