For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

#RajuYadav : 'రాజు యాదవ్‌' ను మే 24న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్

Getup Srinu, Krishnamachari.K, 'Raju Yadav' is releasing on 24th May
11:09 PM May 16, 2024 IST | Sowmya
Updated At - 11:09 PM May 16, 2024 IST
Getup Srinu, Krishnamachari.K, 'Raju Yadav' is releasing on 24th May
 rajuyadav    రాజు యాదవ్‌  ను మే 24న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్
Advertisement

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో విడుదల చేయబోతున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ బ్యాకింగ్ తో రాజు యాదవ్ చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మే 24న రాజు యాదవ్ విడుదల కానుంది.

Advertisement GKSC

స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్  ఈ చిత్రానికి అద్భుతమైన ఆల్బమ్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజు యాదవ్.. లవ్, కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో  అలరించనుంది. సాయిరామ్ ఉదయ్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్.

నటీనటులు : గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల, శ్రీరామ్, కళ్యాణ్ భూషణ్, శ్రీమణి, పవన్ రమేష్, ఉత్తర ప్రశాంత్, తదితరులు..

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: కృష్ణమాచారి. కె
నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి
ఏపీ, తెలంగాణ రిలీజ్: బన్నీ వాస్
బ్యానర్లు: సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
డీవోపీ: సాయిరామ్ ఉదయ్ D.F.Tech
సాహిత్యం: చంద్రబోస్, కాసర్ల శ్యామ్
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగేళా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విప్లవ్
గాయకులు: చంద్రబోస్, రామ్ మిరియాల, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, యసస్వి కొండేపూడి
కొరియోగ్రఫీ: జిత్తు మాస్టర్
పీఆర్వో:  వంశీ - శేఖర్
సోషల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా

Advertisement
Author Image