For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Pushpa 2 Movie Review : జెన్యూన్‍ రివ్యూ పుష్ప-2

09:10 PM Dec 05, 2024 IST | Sowmya
Updated At - 09:10 PM Dec 05, 2024 IST
pushpa 2 movie review   జెన్యూన్‍ రివ్యూ పుష్ప 2
Advertisement

Pushpa 2 :ఊరమాస్‍ కు ఫ్యామిలీ సెంటిమెంట్ కలిపితే …?, ఫ్యామిలీ సెంటిమెంట్ కు ఊరమాస్‍ కలిపి సినిమా తీస్తే ఎట్లా ఉంటాదో … అట్లానే ఉంది పుష్ప-2

పార్టీ లేదా పుష్ప ..!? అని అంటే ….ఒక రాష్ట్రమే కాదు …నేషనల్‍ వైడ్‍ మాత్రమే కాదు యావత్తు వరల్డ్ మొత్తానికి పార్టీ ఇచ్చినట్టుంది పుష్ప-2, ఒక జాకీచాన్‍ ఓ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగెర్‌ లాంటి హాలీవుడ్ హీరోల చిత్రాల్లో చూసే ఫైటింగ్ సీక్వెన్స్ , యాక్షన్ సీక్వెన్సులను ఒక తెలుగు చిత్రంలో చూడటంతో నిజంగా తెలుగు చిత్రం పాన్‍ ఇండియా దాటి వరల్డు వైడ్‍ చిత్రం అయిందని చెప్పవచ్చు.

Advertisement GKSC

హిరో ఇజం… హిరో బ్రాండ్ ‍ చట్రంలో ఇరుక్కొని చిద్రశైల్యమైన తెలుగు చిత్రం, అదే హిరోఇజంతో ఊరమాస్‍ ను ఒక ఫ్యామిలీ సెంటిమెంట్‍ మిక్సు చేసి ఒక తెలుగు చిత్రాన్ని హలీవుడ్‍ చిత్రాల సరసన బెట్టిన ఘనత దర్శకుడు సుకుమార్‍ కే ఇవ్వాలి.

హిరో ఎలెవెషన్‍ తో ప్రారంభమయ్యే సీక్వెన్సు పరంపర ఒక జాతర సీక్వెన్సు, హిరో ఇంటర్‍ నేషనల్‍ డీల్‍ సీక్వెన్సు, పోలీస్ ఆఫీసర్ కు సారీ చెప్పినట్టే చెప్పి చాలెంజ్ చేసే సీక్వెన్స్ , ఎర్రచందనం అడవి నుంచి రాష్ట్రం దాటించే సీక్వెన్సు, దేశం సరిహద్దు దాటించే సముద్రంలో ఫైట్‍ సీక్వెన్సు, అన్నకూతురు ను కిడ్నాపర్ల నుంచి కాపాడే సీక్వెన్సు, ఇలా ప్రతి సీక్వెన్సు ఆద్యాంతం త్రీల్‍ ఫీల్‍ అనే చెప్పాలి.

ఎక్కడ కూడా కాస్త బోరు అనిపించేలా లేకుండా కాపాడిన గొప్పదనం స్క్రీన్ ప్లే ది అని చెప్పాలి, నటన విషయంలో ఎవరికి ఎవరు తగ్గిందే లేదు. సాంకేతిక విలువలు నిపుణుల పనితనంలో ఎక్కడ లోటు లేదు, ఇది పూర్తిగా కమర్సియల్‍ ఫిల్ము కాబట్టి ఒక స్మగ్లర్‍ హిరో అవ్వడం ఎమిటీ అనే ప్రశ్నను ప్రశ్నగా వదిలేసి సినిమా ను సినిమా గా చూస్తే పుష్ప-2 కు వందశాతం మార్కులు ఇవ్వవచ్చు.

Advertisement
Author Image