For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఈ బల్లి ఖరీదు తెలిస్తే మతిపోతుంది... ఎందుకంటే ?

01:02 PM Aug 06, 2023 IST | Sowmya
Updated At - 01:02 PM Aug 06, 2023 IST
ఈ బల్లి ఖరీదు తెలిస్తే మతిపోతుంది    ఎందుకంటే
Advertisement

విలువైన వస్తువులు, మొక్కలతో పాటు జంతువులు, జంతు అవశేషాల అక్రమ రవాణా గుట్టుగా సాగిస్తుంటారు కొందరు స్మగ్లర్లు. ఇది చట్టపరంగా నేరం అయినప్పటికీ కొందరు అక్రమార్కుల కాసుల కక్కుర్తితో ఇలాంటి పనులకు పాల్పడుతుంటారు.

ఈ రోజుల్లో ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడుతున్నాడు. కొన్ని ప్రలోభాలు, తప్పని పరిస్థితుల్లో బలవంతంగానైనా అతను నేర కార్యకలాపాలకు దారితీసే పనులను కూడా చేస్తున్నాడు. స్మగ్లింగ్ గురించి మనందరికీ తెలుసు. విలువైన వస్తువులు, మొక్కలతో పాటు జంతువులు, జంతు అవశేషాల అక్రమ రవాణా కూడా గుట్టుగా సాగిస్తుంటారు కొందరు స్మగ్లర్లు. ఇది చట్టపరంగా నేరం అయినప్పటికీ కొందరు అక్రమార్కుల కాసుల కక్కుర్తితో ఇలాంటి పనులకు పాల్పడుతుంటారు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలలో ఇలాంటి బ్లాక్ మార్కెట్ నడుస్తోంది. కొన్ని జంతువులు, వాటి అవయవాలు మిలియన్ల విలువైనవిగా ఉంటాయి.

Advertisement GKSC

తాజాగా బీహార్‌లో వెలుగులోకి వచ్చిన ఒక బల్లి ఖరీదు తెలిస్తే మతిపోతుంది..ఎందుకంటే.. ఆ బల్లి ఖరీదుతో మీరు ఏకంగా ఓ ఫెరారీ కారును కొనుగోలు చేయవచ్చు. ఈ అరుదైన బల్లిని గెక్కో లిజార్డ్స్ అంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ బల్లికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఎంతటి ధర చెల్లించి అయినా సరే కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు వ్యాపారులు.

ఈ విలువైన బల్లి ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది భారతదేశంలోని బీహార్‌లోనూ అటు, నేపాల్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని కారణంగా ప్రజలు దీనిని బీహారీ బల్లి అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అంతర్జాతీయ మార్కెట్లలో ఈ బల్లి విలువ కోట్లలో ఉంటుంది. దీని మాంసం అనేక వ్యాధులను నయం చేస్తుంది. నపుంసకత్వం, మధుమేహం, ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వ్యాధుల ఔషదాల్లో దీన్ని వినియోగిస్తారు. దీంతో మార్కెట్‌లో బీహారి బల్లికి డిమాండ్‌ కోట్లాది రూపాయలుగా ఉంది. చైనాలో దీనిని చైనీస్ సాంప్రదాయ ఔషధం చేయడానికి ఉపయోగిస్తారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు బీహారి బల్లి వేట కొనసాగిస్తున్నారు.

https://youtu.be/VJJ30NGKIMw

ఇవి కూడా చదవండి Unknown intresting Facts :  ఈ నాలుగు చిరుతల మధ్య తేడాలేంటో మీకు తెలుసా ?

వార్తా పత్రికల చివరలో 4 రంగులు ఎందుకుంటాయో తెలుసా ?

Advertisement
Author Image