For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్

05:43 PM Jul 12, 2024 IST | Sowmya
Updated At - 05:43 PM Jul 12, 2024 IST
గంగా ఎంటర్టైన్మంట్స్  శివం భజే  ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్
Advertisement

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వనున్నట్టు నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి ఈ రోజు తెలిపారు. అప్సర్ దర్శకత్వంలో తెరకక్కనున్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో హీరో - హీరోయిన్లుగా అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ నటించారు. బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... "వైవిధ్యమైన కథతో, సాంకేతిక విలువలతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాణంలో ఆగష్టు 1న విడుదలవ్వనున్న చిత్రం 'శివం భజే'. ఫస్ట్ లుక్ కి, టీజర్ కి అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర విజయంపై మాకున్న విశ్వాసం మరింత పెరిగింది. మా హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అప్సర్, అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి వంటి నటులు, ఇండస్ట్రీ మేటి సాంకేతిక నిపుణుల సహకారంతో మా మొదటి చిత్రం అనుకున్నట్టుగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కర్యక్రమాలు చివరి దశలో ఉండగా ఆగష్టు 1న ప్రపంచవ్యప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం. శివస్మరణతో మొదలైన మా చిత్రానికి ఆయన ఆశీస్సులతో అద్భుత స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ట్రైలర్ మరియు పాటల విడుదల గురించి వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని అన్నారు.

Advertisement GKSC

దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ... "ఆగష్టు 1 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతూ అన్ని వర్గాల, వయసుల ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉంది మా 'శివం భజే'. టైటిల్, టీజర్ తో అందరి దృష్టి ఆకర్షించిన మా చిత్రంపై అన్ని భాషల ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. మా హీరో అశ్విన్ బాబు, ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత మహేశ్వర రెడ్డి గారి పూర్తి సహకారంతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందింది. మా పాటలు, ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం" అన్నారు.

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ... "మా 'శివం భజే' టీజర్ కి వచ్చిన అనూహ్య స్పందనకి మా అందరి విశ్వాసం అమాంతం పెరిగిపోయింది. దర్శకుడు అప్సర్ వైవిధ్యమైన కథకి తగ్గట్టుగా కావాల్సిన సాంకేతిక విలువలు, నిపుణులని ఖర్చు కి వెనకాడకుండా మా నిర్మాత మహేశ్వర రెడ్డి గారు సహకారం అందించడం, ప్రతీ ఒక్కరు తమ కెరీర్ బెస్ట్ ఇవ్వడంతో ఈ చిత్రం మేము ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది. ఆ శివుని అనుగ్రహంతో పాటు మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తాం" అన్నారు.

Advertisement
Author Image