FILM NEWS: "బిగ్ బాస్" ఫేం స్వాతి దీక్షిత్ "గమ్మత్తు" చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ
Gammatthu Logo Launched, Hero Parvatheesham, Heroine Swathi Deekshith, Latest Telugu Movies, Telugu World Now,
FILM NEWS: "బిగ్ బాస్" ఫేం స్వాతి దీక్షిత్ "గమ్మత్తు" చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ
సూపర్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై అంకిత శ్రీనివాస్ రావు గారు మరియు బుయ్యాని మహేష్ కుమార్ గారు సంయుక్తంగా నిర్మించిన గమ్మత్తు అనే చిత్రం టైటిల్ లోగో ను ప్రముఖ నిర్మాత శ్రీ బెక్కెం వేణు గోపాల్ గారి చే ఆవిష్కరించబడింది ఈ చిత్రానికి దర్శకుడు అశ్వని శ్రీ కృష్ణ మరియు తారాగణం కేరింత ఫేం పార్వతీశం బిగ్ బాస్ ఫేం స్వాతి దీక్షిత్ మరియు జబర్దస్త్ ఫేం రాకెట్ రాఘవ గారు వకీల్ సాబ్ సూపర్ వుమెన్ అయినటువంటి లిరీష గారు తారాగణం ఈ చిత్రానికి వసంత్ గారు సంగీత దర్శకత్వం మరియు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ లక్ష్మీకాంత్ కనికే ఎడిటర్ శ్రీకాంత్ పట్నాయక్ మరియు ప్రణవ్ స్వరూప్ ఎగ్సిగ్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్ర నిర్మాణం పనులన్నీ , షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకోని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నది. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని ఈ చిత్ర యూనిట్ సబ్యులు తెలిపారు.
ఈ చిత్ర యూనిట్ కి లక్కీ మీడియా అధినేత ప్రముఖ నిర్మాత శ్రీ బెక్కం వేణు గోపాల్ గారు ఈ టైటిల్ లోగో ఆవిష్కరించిన సందర్బంగా వాళ్ళందర్నీ కూడా అభినందించి శుభాకాంక్షలు తెలియజేసి మంచి విజయం సాధించాలని కోరుకుoటూ, వారిని ఆశీర్వదించారు. ఈ చిత్ర దర్శకులు అశ్వని శ్రీ కృష్ణ , మరియు హీరో పార్వతీశం, హీరోయిన్ స్వాతి దీక్షిత్ డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ లక్ష్మీకాంత్, మరియు ఎగ్సిగ్యూటివ్ నిర్మాత ప్రణవ్ స్వరూప్ మొదలైన వారు మాట్లాడుతూ ఇలా మా యొక మొదటి చిత్రాన్ని సెంటిమెంట్ గా లక్కీ మీడియా అధినేత శ్రీ బెక్కెo వేణు గోపాల్ గారితో ఆవిష్కరించడం చాలా లక్కీ గా ఉందని మాకు ఎంతో లక్ కలిసి వస్తుందని భావిస్తున్నాం అని ఆయనకీ కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేసారు.

