ఆటలు మానసిక ఎదుగుదలకు మరియు శారీరక ఎదుగుదలకు ఒక ఆయుధం : ఆకాష్ జగన్నాధ్
నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన డీఎస్ స్మారక క్రీడా పోటీల ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా సినీ హీరో పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ జగన్నాధ్, అలియాస్ ఆకాష్ పూరి, పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఆకాష్ జగన్నాధ్ మాట్లాడుతూ... క్రీడలు మానసిక ఎదుగుదలకు మరియు శారీరక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అలాగే, నేడు ఈ కంప్యూటర్ జెనరేషన్ లో శారీరక శ్రమ కలిగించే ఆటలు కనుమరుగవుతున్నాయి. ఆటలు ఆడడం వల్ల మానసిక ఆలోచన శక్తి పెరుగుతుంది. ప్రెసెంట్ జనరేషన్‌లో వస్తున్న ఒత్తిళ్లను తట్టుకుని ముందుకు వెళ్లడానికి అది ఎంతో సహాయపడుతుంది. కాబట్టి, నేటి జనరేషన్ కు కబడ్డీ, కో కో, వాలీబాల్ వంటి గేమ్స్ మీద ఆసక్తి కలిగేలా టీచర్స్ మరియు తల్లి తండ్రులు వారి వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ధర్మపురి సంజయ్ గారు ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాల ఆనందంగా ఉందని, నన్ను ముఖ్య అతిధిగా పిలవడం నాకు సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ గారు, సినీ నిర్మాత నటుడు జర్నలిస్ట్ సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.