Telangana Politics : ఉత్త కుమార్ రెడ్డి కాల్వ గట్ల మీద కు వెళితే తెలుస్తది రైతుల బాధ : జి.జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి
తెలంగాణ భవన్ : రాష్ట్రంలో కరువు పరిస్థితులు నిలబడి ఉన్నాయి. రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రైతులు25-30వేలు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. బ్యాంకులు అప్పులు ఇవ్వకపోయినా ప్రైవేట్ అప్పులు తెచ్చుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నికి సోయి లేదు. లక్షలాది ఎకరాలు పంట పొలాలు ఏండి పోతున్నాయ్. పంట చేతికోచ్చే సమయానికి నీళ్లు లేక ఎండిపోతున్నయ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండిన పంటలు రోజు తిరిగి చూస్తున్నాం. అంతకు ముందు జిల్లా ఎమ్మెల్యే లు, మంత్రులుకు మోరపెట్టుకున్నారు రైతులు, అయినా వారు పట్టించుకోవడం లేదు. కాలేశ్వరం నుంచి 100 టీఎంసిల నీరు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్న చేయలేదు. కాళేశ్వరంలో కుంగిన పిల్లర్ల పేర్లు చెప్పి రాజకీయం చేస్తున్నారు.
కరువు కమ్మకొస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సీఎం, మంత్రులు సమీక్ష చేసి ఏ పంటలు పెట్టుకోవాలి అని రైతులకు ఒక్క డైరెక్షన్ ఇవ్వాలి. గతంలో కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు ఏ సీజనల్ కాలం ఇలాంటి పరిస్థితి ఉండబోతుంది అని రైతులకు చెప్పి ఎరువులు, విత్తనాలు ముందుగా తీసుకొచ్చి వాళ్ళము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే యాసంగి పంట స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వాన్నికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులు సమస్యలు పైన సమీక్షా చేయాలి. గతంలో ప్రతి సంవత్సరం రెండు పంటలకు మేము సమీక్ష చేసే వాళ్ళము. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యేత ప్రభుత్వం పైన ఉంటుంది. వ్యవసాయం రంగం పైన బాధ్యత అసలు ఈ ప్రభుత్వానికి లేదు. కొన్ని చోట్ల నీళ్లు ఉన్న ఇస్తలేరు, విద్యత్ సప్లై సరిగ్గా లేక మోటార్లు కాలిపోతున్నాయ్ అని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కాళేశ్వరం ఏదో కుంగి పోయింది అని కేసీఆర్ ని బద్నామ్ చేయడమే తప్పా ఇంకొక్కటి లేదు. ఆల్మటి లో నీళ్లు ఉన్నాయ్, ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చి పోయిన కర్ణాటక నాయకులని అడిగి 10టి ఎం సి ల నీళ్లు తీసుకొని రండి. కే ఆర్ ఎం బి చాలా ఏండ్ల నుంచి ఉంది, కానీ మేము అవన్నీ చూడలేదు రైతులకు నీళ్లు ఇచ్చాము. రైతులను బ్రతికించుకోవడం కోసం కెసిఆర్ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కోమటిరెడ్డి కి సాగర్ డ్యాం పైకి వెళ్లాలంటే లాగులు తడుస్తున్నాయి. మేము ఎండిన పంటలు తిరిగి చూస్తుంటే... కోమటిరెడ్డి ఏమి తెలియనట్టు పది రోజుల నుంచి నటిస్తున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్ల మీద పరిజ్ఞానం లేని వ్యక్తి. నాగార్జున సాగర్ కట్ట మీదికి పోవడానికి లాగులు తడుస్తున్నాయి. ప్రతి విషయానికి ఎగిరేదిరి పడే కోమాటరెడ్డి పద నడువు.. ఉత్త కుమార్ రెడ్డి కాల్వ గట్ల మీద కు వెళితే తెలుస్తది రైతుల బాధ. మంత్రులు అప్పుడే వసూలు.. ముడుపులు కట్టుడు మొదలుపెట్టారు. అందిన కాడికి.. రైస్ మిల్లర్లు.. కాంట్రాక్ట్ ల నుంచి దండుకుంటున్నారు. కోమటిరెడ్డి నల్గొండలో ఇండ్లు కట్టుకునే పేద మధ్యతరగతి ప్రజల నుంచి మున్సిపల్ అధికారులను పంపించి 50వేలు వసూలు చేస్తున్నారు.
బిజెపి కి ఫక్టు రాజకీయం తప్పా ఇంకొక్కోటి లేదు. బిజెపి కి కాంగ్రెస్ కి బి టీం, కాంగ్రెస్ కి బిజెపి బి టీం గా ఉన్నారు అర్ధం కావడం లేదు. ఇద్దరు అండర్స్టాండింగ్ తో ఉన్నారు. ఏ రోజునైనా కిషన్ రెడ్డి ప్రజలు కోసం మాట్లాడారా. మీడియాలో స్పేస్ తప్పా, ప్రజలు బేస్ లేని వ్యక్తి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ని ED విచారించాలి. లిక్కర్ కేసులో రెండేళ్లు గా ఆధారాలూనాయి అని అంటున్న కిషన్ రెడ్డి ఈడీకి ఎందుకు ఇవ్వలేదు. దమ్ము ధైర్యఓ ఉంటే. మీ పార్టీకి బలమే ఉంటే.. BRS నేతలు ఎందుకు చేర్చుకుంటున్నారు. లిక్కర్ కేసులో ఈడి అధికారులు రెండు సంవత్సరాలు విచారణ చేశారు. ED కేసుల పేరుతో ఎన్నికల ముందు ప్రతిపక్షాల నోరు నొక్కాలని బిజెపి నాయకులు చూస్తున్నారు. కెసిఆర్ కేజ్రీవాల్ వల్ల బిజెపి ఓడిపోతుందని భయపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల లబ్ది పొందాలని కెసిఆర్ గారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బిజెపి ఇద్దరు ఒక్కే రకముగా కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నారు. ప్రజలు తెలుసుకున్నారు ఎవరు ఏంటో అని తెలంగాణకు కెసిఆర్ఏ శ్రీరామరక్ష. పార్లమెంట్ ఎన్నికలు బిఆర్ఎస్ కే పట్టం కడతారు ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులైంది రుణమాఫీ ఎందుకు చేయలేదు. బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే 2లక్షల బుుణమాఫిచేయాలి. లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి, రైతుల సమస్యలు పరిష్కారం చేయాలి.