కోకాపేట లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు
• రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణం.
• శాంతి భద్రతలు అదుపు తప్పడానికి చేసిందంతా చేసి ఇపుడు హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు.
• ఎమ్మెల్యే గాంధీకి బందోబస్తు ఇచ్చి దాడులు చేయించింది ఎవరు ..? రేవంత్ రెడ్డి , డీజీపీ లు కాదా ..? నిన్న దాడులు ఎందుకు ఆపలేదు.
• పోలీసులను అడ్డంపెట్టుకొని మా ఎమ్మెల్యే పై దాడి చేసినపుడు రేవంత్ కు, డీజీపీ కి లా అండ్ ఆర్డర్ గుర్తు రాలేదా
• మీరు ఎందుకు నిన్న చర్యలు తీసుకోలేదు డీజీపీ గారు.
• గాంధీ చేసిన దాడి కాదు, రేవంత్ రెడ్డి చేసిన దాడి.
• మమ్మల్ని ఈరోజు హౌజ్ అరెస్ట్ చేశారు, నిన్న గాంధీని ఎందుకు హౌజ్ అరెస్టు చేయలేదు.
• నిన్నటి దాడికి కారణం సీఎం, డీపీజీ దే. చెయ్యాల్సింది చేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు
• రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా. ఖమ్మంలో మా మీద దాడి చేస్తే పది రోజులైనా గుండాల మీద కేసులు పెట్టలేదు.
• ఫిర్యాదు చేయడానికి వెళ్తే అరెస్టులు చేస్తరా? గంటల పాటు తప్పి మహబూబ్ నగర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు.
• మమ్మల్ని అరెస్టులు చేస్తారు, హత్యాయత్నం చేసిన అరికపూడి గాంధీని, అనుచరులను బందోబస్తు మధ్య ఇంటికి పంపుతారా?
• మాకు నీళ్లు కూడా ఇవ్వకుండా గంటల పాటు తిప్పి, దాడులు చేసిన వాళ్లను పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టి బిర్యానీలు తినిపించారు. రాచ మర్యాదలు చేశారు.
• నిన్న జరిగిన దాడికి కర్త, కర్మ, క్రియ అంతా రేవంత్ రెడ్డి. రేవంత్ డైరెక్షన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది.
• తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పాడుచేయొద్దని, పోలీసుల గౌరవాన్ని తగ్గించవద్దని మేము సంయమనం పాటించాం.
• మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలను నిన్న సాయంత్రం నుంచి ఎక్కడిక్కడ హౌజ్ అరెస్టులు చేస్తున్నారు.
• ఫోన్లు చేసి పోలీసు స్టేషన్లకు రావాలని భయబ్రాంతులకు గురి చేస్తున్నరు.
• ఇంత దుర్మార్గమా..? నీ హౌజ్ అరెస్టులతో మా ఆత్మ విశ్వాసం పెరుగుతుందే తప్ప తరగదు
• ఎమర్జెన్సీ కన్నా దారుణంగా రాష్ట్ర పరిస్థితులు తయారయ్యాయి.
• విత్తొకటి నాటితే మొక్కొక్కటి మొలుస్తుందా. పైన సక్కగ వుండాల్సిన నీకే వక్ర బుద్ది ఉంటె కింది స్థాయిలో సక్కగా ఉంటారా ?
• తన అసభ్య ,సంస్కార హీన మైన భాష ను మార్చుకోకుండా యూ ట్యూబ్ చానళ్లకు నీతులు చెబుతున్నాడు.
• ముందు నువ్వు సక్కగా మాట్లాడితే అందరూ సక్కగా అవుతారు, యదా రాజ తథా ప్రజ అన్నట్లు ఉంది.
• కోమటి రెడ్డి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. బిఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాలని చెప్పడం దారుణం.
• తొమ్మిది నెలల్లో పాలన పై కాకుండా పైసల పై దృష్టి పెట్టడం వల్లే శాంతి భద్రతలు పాతాళానికి పోయాయి.
• మీడియాకు లీకులు ఇవ్వడం ద్వారానూ, చిట్ ఛాట్ లలో చెప్పడం ద్వారానో శాంతి భద్రతలు అదుపులోకి రావు.
• సీఎం నోరు అదుపులో పెట్టుకోక బజారు భాష మాట్లాడుతున్న తీరు, రాగ ద్వేషాలు పెంపొందించేట్టుగా చేస్తున్న వ్యవహారాలు రాష్ట్రంలో ప్రశాంతతను మంట గలుపుతున్నాయి.
• ఫిరాయింపుల పై ఢిల్లీలో ఒక్క మాట గల్లీ లో ఒక్క మాట మాట్లాడుతున్నాడు
• ఎన్నికే లేకున్నా పి ఎస్ సి చైర్మన్‌ను నియమించి ఎన్నిక జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం దుర్మార్గం.
• అన్నిటి మీద రేవంత్ ది యూ టర్న్ రాజకీయమే. చెప్పేదొకటి చేసేదొకటి
• సీఎం డ్రామాల తోనే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటున్నది.
• మా మీద ఉన్న కక్ష తెలంగాణ మీద చూపకు. కూర్చున్న చెట్టును నరికేయకు
• అన్నిట్లో నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణ ను నీ నియంతృత్వ పోకడలతో నిర్వీర్యం చేయకు రేవంత్
• డీజీపీ పదవి చాలా ఉన్నతమైంది. ఆదర్శంగా ఉండాల్సిన డీజీపీ రాజకీయ కుట్రలో భాగమై ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చూడటం దుర్మార్గం.
• పోలీసుల పట్ల గతంలో రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో అందరికి తెలిసిందే. ఎలా బండ భూతులు మాట్లాడిండో అందరికి తెలుసు.
• గుడ్డిగా రేవంత్ రెడ్డిని ఫాలో కావొద్దని, విచక్షణతో పని చేయాలని, చట్టం ప్రకారం నడుచుకోవాలని డీజీపీ గారిని, పోలీసులను కోరుతున్నాను.
• రాహుల్ గాంధీ దేశం బయట స్వేచ్ఛ స్వాతంత్య్రాల గురించి లెక్చర్లు ఇవ్వడం కాదు ..నీ పార్టీ కాంగ్రెస్ పాలిస్తున్న తెలంగాణ లో ప్రజల పై విధిస్తున్న ఆంక్షల మీద మాట్లాడు
• ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, పీఏసీ నియామకం కానీ రాజ్యంగ ఉల్లంఘనలు. దీని నుంచి దృష్టి మరల్చేందుకు వ్యక్తుల మధ్య కొట్లాటలాగా చేస్తున్నరు. దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
• డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల సమస్య మీద నుంచి దృష్టి మరల్చుతున్నడు.
• హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారు, వరద బాధితులకు సాయం చేయకుండా మీ మీద దాడి చేయించాడు. రైతు బంధు గురించి అడిగితే కాళేశ్వరం ప్రాజెక్టు అంటడు
• డ్రామాలు కట్టిపెట్టు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి
• పోరాటాలు, కొట్లాటలు మాకు కొత్త కాదు.
• ఖమ్మం, హైదరాబాద్ లో మిమ్మల్ని మీరు రాళ్లతో కొట్టవచ్చు. మీరు విసిరే రాళ్లే అధికారంలోకి బిఆర్ఎస్ రావడానికి పునాది రాళ్లు అవుతాయి జాగ్రత్త.
• 16వ ఆర్థిక సంఘం గురించి మీరు తప్పుడు లెక్కలు చెబితే, మేము బాధ్యతాయుతంగా బలమైన వాదనను వినిపించాం.
• నీటి ప్రాజెక్టులకు, మిషన్ భగీరథకు, రాష్ట్ర అభివృద్దికి నిధులు కావాలని కోరాం.
• రాజకీయం కాదు, రాష్ట్రం ముఖ్యమని భావించి వాస్తవాలు లెక్కల రూపంలో చెప్పాం. 16వ ఆర్థిక సంఘాన్ని సాయం కోరాం.
• ఆంధ్రా నాయకుల మీద రేవంత్ రెడ్డి కపట ప్రేమ వలకబోస్తున్నారు. చిన్న జీయర్ గారిని, యాదాద్రిని నిర్మాణానికి ప్లాన్ ఇచ్చిన ఆనంద సాయిని ఆంధ్రోడు అన్నడు రేవంత్ రెడ్డి.
• డిఫెన్స్ లో ఉన్న ప్రతిసారి కొత్త డ్రామా చేస్తున్నడు. కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకున్నడు.
• పీఏసీకి ఎన్నిక జరిగిందని నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా జరిగింది.
• రాజ్యాంగం ప్రకారం ఎన్నిక పెట్టాలి కానీ, జరగలేదు.
• ఏ రోటికాడ ఆ మాట మాట్లాడుతున్నడు రేవంత్ రెడ్డి.
• ఆదానికి ఓల్డ్ సిటీ అప్పజెప్పుతానని మాట మార్చిండు.
• కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ లో నీ పెత్తనం ఏంటని గాంధీ కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. దానికి సమాధానంగానే కౌశిక్ రెడ్డి మాట్లాడారు తప్ప, సెటిలర్ల మీద కౌశిక్ కామెంట్ చేయలేదు.
• ముందు రెచ్చగొట్టింది గాంధీ. గాంధీ అనే వ్యక్తికి చెప్పిన సమాధానం అది.
• తొక్కిసలాటలో భుజం నొప్పి మొదలైంది. ఎమ్మారై స్కాన్ తీసి 15 రోజుల పాటు ఫిజియోథెరపీ సూచించారు.
• రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ బిఆర్ఎస్ నాయకులను అరెస్టులను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
*అదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మహిళలని చూడకుండా అరెస్టులు చేయడం దుర్మార్గం. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.