స్వయం సహాయక సంఘాల ఉత్పత్తిదారుల కంపెనీలతో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం
మర్రి చెన్నారెడ్డి మావన వనరుల అభివృద్ధి కేంద్రం - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కామెంట్స్
తెలంగాణ సాధించిన విషయాల్లో ఇదొక విజయం, ఒక మల్టీ నేషనల్ కంపెనీ, స్వయం సహాయక సంఘాల తో ఒప్పందం చేసుకోవడం పట్ల శుభాకాంక్షలు! అభినందనలు!!, దేశంలోనే ఇది మొదటి ఒప్పందం!, ఈ ఏడాది 500 కోట్ల వ్యాపార లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరింది, ఫ్లిప్ కార్డ్ కి ఒక క్రెడిట్ ఉంది. వాళ్ళ తో ప్రయాణం తప్పకుండా మన మహిళా సంఘాలకు లాభం చేకూరుతుంది, నీళ్ళు, 24 గంటల కరెంట్ వచ్చింది. దండుగలా ఉన్న వ్యవసాయం పండుగలా మారింది, వ్యసాయం, పరిశ్రమలు పచ్చగా ఉన్నాయి. సాగు దిగుబడి పెరిగింది. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది. మన మహిళా సంఘాలకు దేశంలోనే మంచి పేరుంది, సాగు, వ్యవసాయోత్పత్తులు, ఇతర ఉత్పత్తుల రంగంలోకి మహిళలు వచ్చారు. మహిళా సంఘాలు ముందుకు రావడం వల్ల దళారుల వ్యవస్థకు బ్రేక్ పడింది, మహిళలు నాణ్యమైన వస్తువులు తయారు చేస్తున్నారు, మహిళా సంఘాలు మన తెలంగాణ లో ఉండటం, నేను ఆ శాఖకు మంత్రిగా ఉండటం గర్వంగా ఉంది, మహిళా సంఘాలకు వారి ఉత్పత్తులకు మంచి లాభం జరుగుతుంది, మనకు మన మహిళలే ఆదర్శం.
మన రాష్ట్రంలో ఇంకా అనేక పంటలు పండుతున్నాయి, వాటికి కూడా మార్కెటింగ్ జరిగే విధంగా చూడాలి, మహిళలు తలచుకుంటే సాధించలేనిది లేదు, మహిళలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశిస్తున్నాను, మహిళల వద్ద రికవరీ గ్యారంటీ 100 శాతం ఉంటుంది, మహిళల్లో మంచి చైతన్యం వచ్చింది, అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు, వ్యాపారంలో కూడా వారి చొరవ, శక్తి, శ్రమ బాగా ఉపయోగపడుతున్నాయి, మహిళల్లో ఇంత చైతన్యం రావడానికి కారణం మహిళా సంఘాలే గ్రామాల్లో మహిళలు అంటే ఒక నమ్మకం పెరిగింది, బ్యాంకులు ఎలాంటి గ్యారంటీ లేకుండానే మహిళలకు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. గత ఏడాది 15వేల కోట్ల రుణాలు ఇచ్చాం, ఈ ఏడాది 18వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం, లోన్లు తీసుకొని ఇంటి అవసరాలు తీర్చుకోవడం కాదు, వ్యాపారాలు చేయడానికి ప్రయత్నించండి.
సీఎం కెసిఆర్ గారు కూడా మహిళల సాధికారత ను కోరుకుంటున్నారు, అన్ని రకాల సీజనల్ పండ్లు, వ్యవసాయ ఉత్పత్తులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు చేర్చాలి, కల్తీ లేని, నిఖార్సైన, నాణ్యమైన వస్తువులు అమ్మాలి, 140 రకాల ఉత్పత్తులను గుర్తించారు. ఇంకా మరిన్ని వస్తువులను గుర్టిద్దాం. రైతులు, మహిళలు, ఫ్లిప్ కార్డ్, వినియోగదారులకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను.