For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఇండియన్ మూవీలో ఎవరు టచ్ చేయని పాయింట్ తో వస్తున్న జాకీ చిత్రం ఫస్ట్ లుక్

02:57 PM Sep 26, 2025 IST | Sowmya
Updated At - 02:57 PM Sep 26, 2025 IST
ఇండియన్ మూవీలో ఎవరు టచ్ చేయని పాయింట్ తో వస్తున్న జాకీ చిత్రం ఫస్ట్ లుక్
Advertisement

FILM NEWS :మడ్డీ సినిమా దర్శకుడు తెరకెక్కంచిన పాన్ ఇండియా చిత్రం 'జాకీ' ఫస్ట్ లుక్

పీకే7 స్టూడియోస్ సమర్పణలో డాక్టర్ ప్రగభల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం జాకీ. ప్రతిభావంతుడైన డైరెక్టర్ డా. ప్రగభల్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం మడ్డీ. భారతీయ సినిమాలో తొలిసారిగా మట్టి రేసింగ్‌ నేపథ్యంలో రూపోందిన మడ్డీ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అదే విజయోత్సాహంతో మరింత ఆసక్తికరమైన కథాంశంతో, ప్రేక్షకులకు థ్రిల్ ను పంచడానికి డా. ప్రగభల్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం జాకీ. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయింది.

Advertisement GKSC

వినుత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోట్స్ ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థం అవుతుంది. ముఖ్యంగా మదురైలో సాంప్రదాయంగా కొనసాగుతున్న ఈ గోట్ ఫైట్ చుట్టు అల్లుకున్న కథ అని తెలుస్తుంది. కేవలం ఫైట్స్ మాత్రమే కాదు అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ చిత్రం కోసం డైరెక్టర్ ప్రగభల్ ఎంతో శ్రమించినట్లు తెలుస్తుంది. రియల్ లోకేషన్స్ లో చిత్రీకరించడమే కాకుండా 2022 నుంచి అక్కడి సాంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి అదే ప్రాంతంలో ఉన్నట్లు డైరెక్టర్ తెలిపారు.

సహజసిద్దంగా చిత్రీకరించేందుకు అక్కడి ప్రజలతో మమేకమై, ప్రతీది తెలుసుకొని జాగ్రత్తగా షూట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాదు సినిమా కావాల్సిన ప్రతీ అంశాన్ని జోడించి ఎంతో గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే ను సెట్ చేసినట్లు పేర్కొన్నారు. అందుకోసం నటీనటులు గోట్స్ సంరక్షకులతో కొద్దిరోజులు సవాసం చేసి, వారితో, గోట్స్ తో అనుబంధం పెంచుకున్నట్లు మేకర్స్ తెలిపారు. నటీనటులు అద్భుతమైన ప్రదర్శనతో ఆద్యాంతం కట్టిపడేస్తారని, ఫైట్ సన్నివేశాలకోసం శారీరంగా, మానసికంగా రెడీ అయ్యారని అందుకే ప్రతీ సన్నివేశం అద్భుతంగా వచ్చిందని మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా గోట్ సంరక్షకుల భావోద్వేగాలు కట్టిపడేస్తాయని, అలాగే మదురైలో ఉన్న ఈ సంస్కృతి ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధంచి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు.

చిత్రం: జాకీ
నటీనటులు: యువన్ కృష్ణ, రిధాన్ కృష్ణన్ , అమ్ము అభిరామి, మధు సుధన్ రావు
రచన-దర్శకత్వం : డాక్టర్ ప్రగభల్
నిర్మాత: ప్రేమ కృష్ణదాస్, సీ దేవదాస్
సినిమాటోగ్రఫీ: ఉదయకుమార్
ఎడిటింగ్: శ్రీకాంత్.
సంగీతం: సక్తి బాలాజీ
ఆర్ట్ డైరెక్షన్: సి. ఉదయకుమార్
సౌండ్: రాజా కృష్ణన్
ఫైట్ మాస్టర్: జాకీ ప్రభు
కాస్ట్యూమ్స్: జోషువా మాక్స్‌వెల్

Advertisement
Author Image