For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Manam Saitham : సినీ సౌండ్ ఇంజనీర్ కి 'మనం సైతం' కుటుంబం నుంచి ఆర్థిక సాయం

08:23 PM Apr 03, 2024 IST | Sowmya
Updated At - 08:23 PM Apr 03, 2024 IST
manam saitham   సినీ సౌండ్ ఇంజనీర్ కి  మనం సైతం  కుటుంబం నుంచి ఆర్థిక సాయం
Advertisement

హైదరాబాద్ : సినీ నటుడు, ‘మనం సైతం '(Manam Saitham) కాదంబరి ఫౌండేషన్ నిర్వాహకులు కాదంబరి కిరణ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్‌ తో పోరాడుతున్న సినీ సౌండ్ ఇంజనీర్ ఈమని శ్రీనివాస్ కి '‘మనం సైతం' నుంచి 25,000 ఆర్థిక సాయం చేశారు. ఈమని శ్రీనివాస్ రావుకి కిడ్నీలు ఫెయిల్ అయ్యి తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఆయన భార్య ఈమని శ్రీదేవి తన కిడ్నీ దానం చయడానికి సిద్ధమయ్యారు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కై సాయం కోసం ‘మనం సైతం' నిర్వాహకులను అభ్యర్థించగా కాదంబరి కిరణ్ సాయం అందించారు. ఆపద కాలంలో ఆర్థిక సాయం చేసిన ‘మనం సైతం' నిర్వాహకులు కాదంబరి కిరణ్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

‘మనం సైతం' ఫౌండేషన్ నుంచి కాదంబరి కిరణ్ నిరంతరం సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. గతవారం సినీ రైటర్ భరత్ కుమార్ పక్షపాతం, హృద్రోగంతో తీవ్ర అనారోగ్యానికి గురికాగా వైద్య అవసరాలకై మనంసైతం కుటుంబం నుంచి రూ.25,000 సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.

Advertisement GKSC

సూర్యాపేటకు చెందిన రిపోర్టర్ వై. రవి కుమార్ తల్లి తారమ్మ కిడ్నీస్ దెబ్బతిన్నాయి. వారి తండ్రికి కాళ్ళు ఇన్ఫెక్షన్ తో ఇబ్బందులు పడుతున్నారు. వారి వైద్యవసరాల కోసం "మనంసైతం" కుటుంబం నుంచి రూ.25,000 ఆర్థిక సాయం చేసారు కాదంబరి కిరణ్. నేడు సీనియర్ జర్నలిస్ట్ టి ఎల్ ప్రసాద్ కంటి ఆపరేషన్ కొరకు 25,000/-ఆర్ధిక సాయం అందించారు. పదేళ్లుగా మనం సైతం ఫౌండేషన్ ద్వారా కాదంబరి కిరణ్ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. మనం సైతం సిద్ధంగా ఉంటుందని కాదంబరి కిరణ్ చెప్పారు.

Advertisement
Author Image