For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

రసవత్తరంగా ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికలు అధ్యక్షుడిగా కెఎస్ రామారావు ఘన విజయం

11:36 PM Sep 29, 2024 IST | Sowmya
Updated At - 11:37 PM Sep 29, 2024 IST
రసవత్తరంగా ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికలు అధ్యక్షుడిగా కెఎస్ రామారావు ఘన విజయం
Advertisement

2024- 2026 టర్మ్ కు సంబంధించిన హైదారాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికలు 29 సెప్టెంబర్ ఆదివారం నాడు రసవత్తరంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో సినీ ప్రముఖులు, జంట నగరాలకు చెందిన అనేక మంది వివిధ రంగాల హేమాహేమీలన మెంబెర్స్ దూరప్రాంతాల నుండి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

డాక్టర్ కెఎల్ నారాయణ, అల్లు అరవింద్, సురేష్ బాబు ప్యానల్ నుంచి సినీ నిర్మాత కెఎస్ రామారావు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఈ క్రమంలో కెఎస్ రామారావును ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో ఎన్నుకున్నారు మెంబర్లు. ఇక అదే సమయంలో ఉప అధ్యక్షుడుగా ఎస్ ఎన్ రెడ్డి గెలుపొందారు. అలాగే ట్రెజరర్ పోస్టుకు శైలజ జూజాల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. సెక్రటరీగా తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీగా శివారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక కమిటీ మెంబర్లలో ఏడిద రాజా గెలుపొందారు.

Advertisement GKSC

మిగతా కమిటీ మెంబర్లుగా వేణు అలియాస్ పీవీసీ కృష్ణం రాజు, కోగంటి భవాని, సీహెచ్ వరప్రసాద్ ఎన్నికయ్యారు. అలాగే ప్రమోటింగ్ కమిటీలో కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, బాలరాజు , మురళీ మోహన్ రావు, నవకాంత్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ఎన్నికలు ఒక వేడుకగా రసవత్తరంగా జరుగుతాయి. 31 వ సంవత్సరంలో క్లబ్ ఎంటర్ అయిన సందర్భంగా సభ్యుల సహకారంతో ఎన్నికలు నిర్వహించడం జరిగింది అని నూతన కమిటీ తెలిపింది.

Advertisement
Tags :
Author Image