For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Feuji : ఫ్యూజీ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది : గ్లోబల్ డెలివరీకి కొత్త దిశ

09:17 PM Jan 12, 2025 IST | Sowmya
UpdateAt: 09:36 PM Jan 12, 2025 IST
feuji   ఫ్యూజీ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది   గ్లోబల్ డెలివరీకి కొత్త దిశ
Advertisement

Feuji Software Solutions Private Limited : హైదరాబాద్, భారతదేశం –  ఫ్యూజీ తన గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను హైదరాబాద్‌లో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభించినట్లు గర్వంగా ప్రకటించింది. ప్రపంచ స్థాయిలో అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలకు నాంది పలికే ఈ కార్యాలయం ఫ్యూజీ నాణ్యతకు నడిమెట్టు అని చెప్పవచ్చు. ఇది సృజనాత్మకత మరియు సహకారాన్ని పెంపొందించే చక్కని పని వాతావరణాన్ని కల్పించడానికి రూపొందించబడింది. ప్రారంభోత్సవ వేడుకకు గౌరవ అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు & వాణిజ్య మరియు సమాచార సాంకేతిక శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జయేశ్ రంజన్ గారు (IAS) మరియు భారతదేశంలో కోస్టా రికా రాయబార కార్యాలయం అధికారి శ్రీమతి సోఫియా సాలస్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) మరియు ప్రముఖ బహుళజాతి సంస్థల ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం విశేషం.

ఫ్యూజీ గ్లోబల్ డెలివరీ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) కార్యకలాపాలకు కీలక కేంద్రంగా రూపొందించబడింది. ఇందులో శక్తివంతమైన సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (SOC), ఆవిష్కరణకు ప్రోత్సాహం ఇచ్చే డైనమిక్ స్పేసులు, క్లయింట్ ఎంగేజ్‌మెంట్ కోసం ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆధునిక నగర వీక్షణలతో బాల్కనీ లాంజ్, నూతన పరిష్కారాల ఆవిష్కరణ కోసం హైటెక్ ఇన్నొవేషన్ రూమ్, క్లయింట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, మరియు లీడర్‌షిప్ ఫోరమ్‌ల కోసం ప్రత్యేకమైన స్టేజ్ అరేనా వంటి అనేక ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

Advertisement

ప్రారంభోత్సవంలో ఫ్యూజీ వ్యవస్థాపకుడు మరియు CEO శ్రీ మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ, “ఈ కార్యాలయం మా సిబ్బంది మరియు క్లయింట్లు అభివృద్ధి చెందేందుకు ఉత్తమ వాతావరణం కల్పించాలన్న మా కట్టుబాటును ప్రతిబింబిస్తుంది. హైదరాబాదు విశిష్టమైన ప్రతిభావంతుల అందుబాటుతో పాటు ఆవిష్కరణలకూ ఆహ్లాదకమైన వాతావరణం అందిస్తోంది. ఇది మా GCC వ్యూహానికి ముఖ్యమైన భాగంగా మారుతోంది,” అని చెప్పారు.

ఈ ప్రారంభోత్సవానికి ఫ్యూజీ గౌరవనీయ బోర్డు సభ్యులు, ఫార్చూన్ 500 కంపెనీలకు సలహాదారులైన డాక్టర్ రామ్ చరణ్ మరియు ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు, రచయిత శేఖర్ కమ్ముల గార్లు పాల్గొన్నారు. వారి నైపుణ్యం మరియు మార్గదర్శకత్వం ఫ్యూజీకి నూతన ఆవిష్కరణలకు పునాది వేస్తోంది. డల్లాస్, టెక్సాస్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఫ్యూజీ, కోస్టా రికా మరియు భారతదేశం వంటి ప్రదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచ స్థాయి ఆవిష్కరణలను అనుసంధానిస్తోంది. హైదరాబాద్ కేంద్రం ఫ్యూజీ స్థిర అభివృద్ధి పయనంలో కీలక మైలురాయిగా నిలుస్తుంది.

Advertisement
Tags :
Author Image