For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Extra Marital Affair : మర్మాంగాలను కోసి ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య..!

12:30 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:30 PM May 13, 2024 IST
extra marital affair   మర్మాంగాలను కోసి ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య
Advertisement

Extra Marital Affair : రోజులు మారుతూనే ఉన్నాయి... ఇలాంటి వార్తల్ని నిత్యం చదువుతూనే ఉంటున్నాం కానీ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. వివాహేతర సంబంధాల కారణంగా ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయో అందరికీ తెలిసిందే. క్షణాల శారీరిక సుఖం కోసం ప్రజలు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఓ మహిళ కూడా ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని... భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన కర్ణాటక రాష్ట్రం లోని బెంగళూరులో గల యెళహంకలో చోటుచేసుకుంది.

గత శుక్రవారం రాత్రి యెళహంకలోని లేఔట్‌లో ఓ భవనంపై చంద్రశేఖర్‌ (35) అనే వ్యక్తి తల, మర్మాంగాలపై గాయాలతో హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా... అందరూ షాక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి జిల్లాలోని హిందూపురానికి చెందిన చంద్రశేఖర్‌కు శ్వేత (19) అనే యువతితో 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. చంద్రశేఖర్‌ తన సొంత అక్కకూతురు అయిన శ్వేత ను వివాహం చేసుకున్నాడు. చంద్రశేఖర్‌ కంటే శ్వేత 16 ఏళ్లు చిన్నది. అక్క కూతురు అనే కారణంతో ఇద్దరికి బలవంతంగా వివాహం జరిపించారు. పెళ్లైన తర్వాత శ్వేత కాలేజీకి వెళ్లేది. కాలేజీలో శ్వేతకు కొందరు యువకులతో స్నేహం ఏర్పడింది. అక్కడ స్నేహితులతో కలిసి షికార్లకు వెళ్లేదని చంద్రశేఖర్‌ ఆమెతో తరచూ గొడవపడేవాడు. దీంతో కుటుంబసభ్యులు 4 నెలల కిందటే దంపతుల మధ్య రాజీ చేసి హిందూపురం నుంచి యెళహంక కొండప్ప లేఔట్‌లో ఉండాలని ఇక్కడకు పంపించారు.

Advertisement GKSC

కాగా శ్వేత హిందూపురానికి చెందిన ప్రియుడు సురేశ్‌తో సంబంధం కొనసాగిస్తోంది. సురేశ్‌ అప్పుడప్పుడు శ్వేత ఇంటికి వచ్చివెళ్లేవాడు. చివరికి ఈ విషయం భర్త చంద్రశేఖర్ కు తెలియడంతో వారి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ క్రమంలో శ్వేత తన ప్రియుడితో కలిసి చంద్రశేఖర్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ మేరకు అక్టోబరు 22న సురేశ్.. బెంగళూరు వచ్చి చంద్రశేఖర్‌ను కలిశాడు. మీతో మాట్లాడాలంటూ మేడపైకి తీసుకెళ్లి పక్కనే ఉన్న ఇటుక తీసుకుని చంద్రశేఖర్‌ తలపై దాడి చేశాడు. దీంతో చంద్రశేఖర్ తీవ్ర రక్తస్రావమై కింద పడిపోగా... సురేశ్, చంద్రశేఖర్ జననాంగాలను కోసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. భర్త హత్య జరిగిన సమయంలో భార్య శ్వేత ఇంట్లోనే ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆ తర్వాత శ్వేతను ప్రశ్నించగా... ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి వెళ్లారని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా ప్రియుడు సురేశ్‌తో కలిసి హత్య చేసినట్లు నిజాలను బయటపెట్టింది. ఇక వారిద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement
Author Image