For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఈటలకు అమిత్ షా ఫోన్ ? ఈటెలకు BJP రెడ్ కార్పెట్, రెండు రోజులుగా మంతనాలు,

02:59 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:59 PM May 11, 2024 IST
ఈటలకు అమిత్ షా ఫోన్   ఈటెలకు bjp రెడ్ కార్పెట్  రెండు రోజులుగా మంతనాలు
Advertisement

Etela Rajender Joining in BJP Party, Amith Shah, Telangana Political News, CM KCR, TRS,

ఈటలకు అమిత్ షా ఫోన్ ? ఈటెలకు BJP రెడ్ కార్పెట్, రెండు రోజులుగా మంతనాలు,

Advertisement GKSC

■ బండి సంజయ్, కిషన్ రెడ్డి, వివేక్ లతో ఈటల చర్చలు.

■ ఈటల రాజేందర్ కు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సోమవారం ఫోన్ చేసినట్టు ఢిల్లీ నుంచి వార్తలు అందుతున్నవి. కాగా బండి సంజయ్, కిషన్ రెడ్డి, వివేక్ లతో ఈటల మంగళవారం ఉదయం చర్చలు జరిపారు. సోమవారం రాత్రి కూడా చర్చలు జరిగినవి. సోమవారం నాటి చర్చల్లో ఈ నలుగురితో పాటు DK.అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నట్టు సమాచారం ఉన్నది. TRS 'తిరుగు బాటు'నాయకుడు ఈటల రాజేందర్ ను తమ పార్టీలో చేరవలసిందిగా BJP ఆహ్వానించింది. ఈటల తో BJP తెలంగాణ 'రెడ్డి' నాయకులు మంతనాలు జరుపుతున్నారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో గతంలో ఒక వెలుగు, వెలిగిన వ్యక్తి BJP కి,ఈటలకు మధ్య సమన్వయకర్తగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. అయితే ఈటల BJP లో చేరే అంశంపై 'మానసికంగా' సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

రేవంత్ రెడ్డి TPCC అధ్యక్షుడు అవుతారా? లేదా? అనే అంశాన్ని బట్టి ఈటల నిర్ణయం ఉంటుంది. ఈ లోగా BJP నుంచి అందిన ఆహ్వానంతో ఈటల మనసు మార్చుకున్నారు. మొయినా బాద్ లో బీజేపీ TS కోర్ కమిటీ సభ్యుడు వివేక్ ఫాం హౌస్ లో రెండు రోజులుగా రహస్య మంతనాలు సాగుతున్నవి. ఈటల 'గ్రీన్ సిగ్నల్' ఇచ్చినందుకు ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక విమానంలో సోమవారం హైదరాబాద్ కు హుటాహుటిన చేరుకున్నట్టు BJP వర్గాలు చెబుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తే తాను ఇండిపెండెంట్ గా గెలవడం కష్టమని ఈటల భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్ల BJP, కాంగ్రెస్ ల వైపు చూస్తున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డికి TPCC సారధ్యం లభిస్తుందో లేదో తెలియదు కనుక BJP అయితేనే SAFE అనే నిర్ధారణ కు రాజేందర్ వచ్చి ఉండవచ్చు. "నేను రాజీనామా చెయ్యను కానీ ఒకవేళ ఎన్నికలు వస్తే తాను స్వతంత్రంగా పోటీ చేస్తాను" అని ఈటెల రాజేందర్ చాలా సార్లు చెప్పారు. TRS అధ్యక్షుడు KCR గురించి బాగా అవగాహన ఉన్నందున ఇండిపెండెంట్ గా CHANCE తీసుకోరాదని ఈటల అభిప్రాయపడుతున్నట్టు చెబుతున్నారు.

Advertisement
Author Image