For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

PURE EV ePluto 7G Max : ఒక్క‌సారి రోడ్డెక్కితే.. 201 కి. మీ నాన్ స్టాప్ రైడ్

09:11 AM Oct 12, 2023 IST | Sowmya
UpdateAt: 09:11 AM Oct 12, 2023 IST
pure ev epluto 7g max   ఒక్క‌సారి రోడ్డెక్కితే   201 కి  మీ నాన్ స్టాప్ రైడ్
Advertisement

ప్యూర్ EV.. 201 KM రేంజ్ లో.. ePluto 7G Max అనే.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. రివ‌ర్స్ మోడ్ కూడా క‌లిగిన స్కూట‌ర్ గా దీని ప్ర‌త్యేక‌త‌లెన్నో.. ఉన్నట్టు చెబుతోందీ సంస్థ‌. ప్యూర్ EV- E ప్లూటో 7G మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి.. ఎలక్ట్రిక్ మోటార్‌ కనెక్ట్ చేయ‌టంతో.. ఎంతో స్పెష‌ల్ రైడింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది. రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్ర‌మే కాకుండా, మ‌రెన్నో స్పెష‌ల్ ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చిందీ కంపెనీ.

మాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్ మొత్తం నాలుగు రంగుల్లో ల‌భ్య‌మ‌వుతోన్న ప్యూర్ EV ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయ మార్కెట్లోకి విడుద‌ల చేస్తోందీ సంస్థ‌. దీని ఎక్స్- షోరూమ్ ధ‌ర‌.. కేవ‌లం రూ. 1, 14, 999 మాత్ర‌మే. ఈ స్కూటర్ బుకింగ్.. దేశవ్యాప్తంగా ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ప్లూటో వాహ‌నాన్ని బుక్ చేసుకున్న వారికి ఈ పండుగ సీజన్ నుంచి డెలివ‌రీ అందిస్తున్నారు.

Advertisement

రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా తీర్చిదిద్దిన ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 201 కిలోమీట‌ర్ల నాన్ స్టాప్ గా ప‌రుగులు దీస్తుంది. అంతే కాదు, ఈ EV మ‌రెన్నోఆస‌క్తిక‌ర‌మైన‌ ఫీచర్లను సైతం క‌లిగి ఉంది. ఇది హిల్-స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ ను కూడా తీర్చిదిద్దారు. లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ AI వంటి స‌దుపాయాలుండ‌టం మ‌రో స్పెషాల్టీ.

ఈ స్కూట‌ర్ కి క‌నెక్ట్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌కు 3.5 kWh లిథియం- అయాన్ బ్యాటరీ ప్యాక్ ను అమ‌ర్చ‌డం వ‌ల్ల‌.. ఇది 3.21 bhp మేర‌.. అత్య‌ధిక‌ శక్తినందిస్తుంది. ఈ AIS-156-సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్‌లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన స్మార్ట్ బ్యాటరీ సామ‌ర్ధ్యం అత్యంత కీల‌కంగా చెబుతున్నారు. దీంతో ఈ స్కూట‌ర్ మ‌రింత మెరుగ్గా భార‌తీయ ర‌హ‌దారుల‌పై ప‌రుగులు దీయ‌టం ఖాయంగా చెబుతున్నారీ కంపెనీ నిర్వాహ‌కులు.

రైడింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఇంకాస్త పెంచ‌డానికి, మొత్తం మూడు రైడింగ్ మోడ్‌లు క‌లిగి ఉన్నాయ‌ని అంటున్నారు. దీంతో పాటు, ఈ EV స్కూటర్ 60 వేల‌ కిలోమీటర్ల వారంట్ తో వస్తోంది. 70 వేల‌ కిలోమీటర్ల వారంటీ కూడా అందుబాటులో ఉందని చెబుతున్నారు కంపెనీ ప్ర‌తినిధులు.

Advertisement
Tags :
Author Image