For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Drinker Sai Movie : సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న 'డ్రింకర్ సాయి', త్వరలో ఓటీటీలోకి రాబోతున్న మూవీ

10:32 PM Jan 05, 2025 IST | Sowmya
UpdateAt: 10:34 PM Jan 05, 2025 IST
drinker sai movie   సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న  డ్రింకర్ సాయి   త్వరలో ఓటీటీలోకి రాబోతున్న మూవీ
Advertisement

FILM NEWS : ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఇన్స్ పైరింగ్ సక్సెస్ అందుకుంది ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన "డ్రింకర్ సాయి". గత నెల 27న రిలీజైన ఈ సినిమా ప్రతి సెంటర్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. సూపర్ హిట్ కలెక్షన్స్ తో ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెకండ్ వీక్ లో బీ, సీ సెంటర్స్ లో మంచి వసూళ్లు సాధిస్తోంది. తొలి 5 రోజులకు 3.11 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా సెకండ్ వీక్ కు 5.75 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిందని మేకర్స్ తెలిపారు. థియేటర్స్ లో వచ్చిన ఈ ఆదరణతో తమిళం, కన్నడ వంటి ఇతర భాషల్లో డబ్బింగ్ రైట్స్ కోసం డిమాండ్ ఏర్పడుతోంది.

అయితే తమిళంలో తామే డ్రింకర్ సాయి మూవీని డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నెలాఖరులో గానీ, ఫిబ్రవరి తొలి వారంలోనే గానీ "డ్రింకర్ సాయి" సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ తీసుకురాబోతున్నారు. ఓటీటీ పేరు, స్ట్రీమింగ్ డేట్ త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. "డ్రింకర్ సాయి" చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు.

Advertisement

Advertisement
Tags :
Author Image